కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు పెళ్లై నెలరోజులు కూడా నిండకుండానే ఓ యువజంట ప్రాణాలు తీశాయి. అత్తింటి..వరకట్న వేధింపులకు నవ వివాహిత ఆత్మహత్య చేసుకోగా, ఆమె భర్త జైల్లో ఉరేసుకుని మరణించాడు. 

మైసూరు శ్రీరాంపుర ఎస్ బీఎం కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రదీప్ కు మైసూరు జిల్లా నంజగూడు తాలూకా సరగూరు గ్రామానికి చెందిన ఆశారాణితో ఏప్పిల్ 4న వివాహం అయ్యింది. ఈ నెల 3వ తేదీన ఆశారాణి ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది.

దీంతో ఆశారాణి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. అత్తింటి వేధింపులు తాళలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కువెంపు నగర పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

దీంతో ప్రదీప్ ను పోలీసులు అరెస్ట్ చేసి కరోనా కేసుల కారణంగా కైలాసపురంలోని ఖైదీల తాత్కాలిక కేంద్రంలో ఉంచారు. గురువారం అక్కడే బెడ్ షీట్ తో ప్రదీప్ ఉరేసుకుని ఆత్మహ్య చేసుకున్నాడు.