అయోధ్యలో రామ మందిరం: రామ్ లల్లా విగ్రహం కళ్లకు గంతలెందుకో తెలుసా?
ప్రాణ ప్రతిష్టకు ముందు విగ్రహం కళ్లకు ఎందుకు గంతలు కట్టకపోవడానికి పలు కారణాలున్నాయి.
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న జరగనుంది. అయితే ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే గర్బగుడిలోకి రామ్ లల్లా విగ్రహన్ని చేర్చారు. అయితే రామ్ లల్లా విగ్రహం కళ్లకు ఉన్న గంతలను ఈ నెల 22న విప్పుతారు.
also read:అయోధ్యలో రామ మందిరం: రామ్ లల్లా విగ్రహం 51 ఇంచులే ఎందుకు?
విగ్రహం కళ్లకు గంతలెందుకు కడుతారు?
పూజలు, క్రతువులు, హోమాల ద్వారా విగ్రహంలో 50 శాతం శక్తి వస్తుందని విశ్వాసం. విగ్రహం ప్రతిష్టించిన నేలలో యంత్ర విన్యాసం చేసిన తర్వాత ఆ శక్తి మరింత పెరుగుతుంది.
also read:అయోధ్యలోని రామమందిరం: రామ్ లల్లా విగ్రహం బ్లాక్ స్టోన్‌తోనే ఎందుకు చేశారంటే?
మంత్రోఛ్చారణ, పలు క్రతువుల ద్వారా విగ్రహనికి శక్తి వస్తుంది. విగ్రహంలోనికి ఈ శక్తులు చొచ్చుకుపోయేలా చేస్తారు. విష్ణుకళలు,శక్తికళలు, చంద్రకళలు, ఈశ్వర కళలు, సూర్యకళలు, అగ్ని కళలు, మాతృకా కళలు, సాదశివ కళల ద్వారా విగ్రహంలోకి శక్తులను చొచ్చుకుపోయేలా చేస్తారని పండితులు చెబుతున్నారు. దీని కారణంగానే విగ్రహంలోకి శక్తి వస్తుందని చెబుతున్నారు.
also read:అయోధ్య రామమందిరం: ముఖ్య యజమాన్ అంటే ఏమిటీ?
అయితే విగ్రహం కళ్ల ద్వారా ఈ శక్తులు చొచ్చుకు వెళ్తాయి. అప్పటివరకు విగ్రహ ప్రాణ ప్రతిష్ట వరకు విగ్రహం కళ్లకు గంతలను విప్పరు.విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన ముహుర్త సమయంలో విగ్రహం కళ్లకు ఉన్న గంతలు విప్పుతారు. అయితే ఆ సమయంలో నేరుగా విగ్రహం కళ్లను చూడవద్దని చెబుతారు. ఆవుకు ముందుగా విగ్రహన్ని చూపుతారు.లేదా అన్నం రాశిని విగ్రహం ముందు పెడతారు.ఈ క్రమ పద్దతిలో చేసిన పూజ విధానంలో విగ్రహనికి శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే అందుకే దేవాలయంలోకి వెళ్లి దేవుడి విగ్రహన్ని చూడగానే ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అయోధ్యలోని రామ మందిరంలోని రామ్ లల్లా విగ్రహనికి కళ్లకు గంతలు లేకుండా కొన్ని ఫోటోలు ఇప్పటికే మీడియాలో వైరల్ గా మారాయి.ఈ విషయమై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విచారిస్తామని ప్రకటించింది.ఈ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయనే విషయమై ఆరా తీస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.