Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టు న్యాయమూర్తి బీజేపీపై పక్షపాత వైఖరి చూపించొచ్చు.. మమతా బెనర్జీ

కోల్‌కతా: బెంగాల్‌, నందిగ్రామ్ లో బిజెపి అభ్యర్థి సువేందు అధికారిని ఎన్నికను సవాలు చేస్తూ తాను వేసిన పిటిషన్‌ను వేరే కోర్టుకు అప్పగించాలని మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు లేఖ రాశారు. ఈ కేసును ప్రస్తుతం జస్టిస్ కౌసిక్ చందాకు అప్పగించారు.

Why Mamata Banerjee Wants Judge Changed In Case Against Suvendu Adhikari - bsb
Author
Hyderabad, First Published Jun 19, 2021, 9:57 AM IST

కోల్‌కతా: బెంగాల్‌, నందిగ్రామ్ లో బిజెపి అభ్యర్థి సువేందు అధికారిని ఎన్నికను సవాలు చేస్తూ తాను వేసిన పిటిషన్‌ను వేరే కోర్టుకు అప్పగించాలని మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు లేఖ రాశారు. ఈ కేసును ప్రస్తుతం జస్టిస్ కౌసిక్ చందాకు అప్పగించారు.

ముఖ్యమంత్రి తరఫున ఆమె న్యాయవాది రాసిన లేఖను జూన్ 16 న కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. ఈ లేఖలో, బెనర్జీ అభ్యర్థనకు రెండు కారణాలను వివరించారు.

జస్టిస్ చందాకు గతంలో బిజెపితో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సువేందు కూడా బీజేపీ నుంచే పోటీ చేశాడు కాబట్టి..  "ప్రతివాదికి అనుకూలంగా.. పక్షపాతంగా వ్యవహరిస్తారన్న భయం" మొదటి కారణంగా మమతా పేర్కొన్నారు.  

బీజేపీకి న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి కాబట్టే.. కోర్టు తీర్పులో పక్షపాత వైఖరి కనబరిచే అవకాశాలున్నాయన్న కారణంగానే,  ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ చందా నియామకాన్ని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపారు. 

దీనివల్ల జడ్జి కేసును చూసే దృష్టికోణంలో మార్పు వచ్చే పరిస్థితి ఉంది. అంతేకాదు ఇది జడ్జి తన సొంత కేసు అని భావించే అవకాశం ఉంది. అని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. న్యాయం జరగడం ఒక్కటే కాదు.. న్యాయం జరిగేలా చూడగలగాలి. అప్పుడే న్యాయవ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం నిలబడుతుందని... ఆమె నొక్కిచెప్పారు.

దీనికంటే ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎంపి డెరెక్ ఓబ్రెయిన్ జస్టిస్ చందాను ఉద్దేశించి ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు. ఒక ట్వీట్‌లో బిజెపి లీగల్ సెల్ సమావేశంలో జస్టిస్ చందా ఉన్న ఫొటోలు షేర్ చేశారు. వీటిల్లో తేదీలు  కనిపించడంలేదు. ఈ సమావేశంలో బిజెపి బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ కూడా పాల్గొన్నారు.

అంతేకాదు, ఇంకో ట్వీట్ లో జస్టిస్ చందా 2019 లో న్యాయమూర్తి కావడానికి ముందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే సమయంలో వాదించిన బిజెపికి చెందిన అనేక  కేసులను ఆయన లిస్ట్ అవుట్ చేశారు.

తృణమూల్ స్పోక్స్ పర్సన్ కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. జస్టిస్ చందాకు ఆయనకే తెలియకుండా బీజేపీ మీద సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. అందుకే ఈ కేసును ఆయన వదిలివేయడమే మంచిది... అని సూచించారు ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పిటిషన్‌ ను ఈ ఉదయం జస్టిస్ చందా క్లుప్తంగా విచారించి జూన్ 24 కి వాయిదా వేశారు.

ప్రజల ప్రాతినిధ్య చట్టానికి సంబంధించిన కేసులలో పిటిషనర్  (ఈ కేసులో మమతా బెనర్జీ) కోర్టులో హాజరు కావాలి. లేకపోతే, కోర్టు పిటిషన్ను కొట్టివేయవచ్చు. మమతా బెనర్జీ ఈ రోజు కోర్టుకు హాజరుకాలేదు. వచ్చే వారం ఆమె హాజరవుతారా అనేది స్పష్టంగా తెలియదు.

నందిగ్రామ్ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తే మమతా బెనర్జీ మేలో కోర్టును ఆశ్రయించారు. ఆమె  ప్రత్యర్థి సువేందు అధికారికి వ్యతిరేకంగా పోటీ చేసి 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది.

లంచాలు, ద్వేషం, శత్రుత్వాన్ని పెంచేలా, మతపరమైన ప్రచారలతో ఓట్లను ప్రభావితం చేశాడని, అవినీతి పద్ధతుల్లో వ్యవహరించాడని అతని ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ఆమె కోరారు. బెనర్జీతో పాటు, ఎన్నికల్లో ఓడిపోయిన మరో నలుగురు తృణమూల్ నాయకులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు.

వారు శాంతిరామ్ మహాటో (బలరాంపూర్ నుండి), అలోరాని సర్కార్ (మొయినా), మనస్ మజుందార్ (గోఘాట్ ), అశోక్ దిండా (బొంగావ్ దక్షిణ) నుంచి పోటీచేసి ఓడిన వారు ఉన్నారు. శాంతిరామ్ మహాటో కేసులో ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలు చెక్కుచెదరకుండా ఉండాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మే 2 - ఓట్ల లెక్కింపు రోజు - నందిగ్రామ్ లో లెక్కింపు  అనేక మలుపులు తిరిగాయి.
మమతా బెనర్జీ సువేందు అధికారి మీద 11 రౌండ్ల వరకు ఆధిక్యంలోనే ఉన్నారు.   కానీ, అనూహ్యంగా  తరువాతి నాలుగు రౌండ్లలో సీన్  మారిపోయింది. ఆరు నుండి 11,000 వరకు తేడా వచ్చింది. అలా సువెందు అధికారి చివరి రౌండ్లలో విజయం సాధించి,విజేతగా ప్రకటించబడ్డాడు. 

ఇక్కడ అవినీతి జరిగిందనడానికి సాధ్యమైన అవకతవకలన్నింటినీ మమతా సూచిస్తూ, ఆ రోజు సాయంత్రంలెక్కింపు సమయంలో సర్వర్లు నాలుగు గంటలు డౌన్ అయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల అధికారిని బెదిరించారని ఆమె పేర్కొన్నారు. ప్రజల తీర్పును తాను అంగీకరించానని మమతా  చెప్పారు, అయితే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించిన తీరుపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios