కరోనా మహహ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ మహహ్మారికి మనదేశంలో వ్యాక్సిన్ తయారీ కొనసాగుతోంది. కాగా.. ఈ వ్యాక్సిన్ ని త్వరలో పంపిణీ చేసే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కాగా... తాజాగా.. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు.

వచ్చే ఏడాది జనవరి నుంచి భారత్ లో వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు హర్షవర్దన్ పేర్కొన్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.  వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేని వారికి తాము బలవంతంగా వ్యాక్సిన్ ఇవ్వమని ఆయన చెప్పడం విశేషం.

‘వచ్చే ఏడాది జనవవరిలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టనున్నాం. జనవరి నెల ఏ వారంలో అయిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం కావొచ్చు. ఇందుకు సంబంధించి రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌ లేవల్స్‌ వారిగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 206 జిల్లాల నుంచి దాదాపు 20 వేల మందికి శిక్షణ ఇచ్చాం. అయితే వీటన్నింటి కంటే ముందు వ్యాక్సిన్‌ భద్రతకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న పలు అనుమానాలను దూరం చేయడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. అయితే ప్రజలందరికి వ్యాక్సిన్‌ ఇవ్వడం మా బాధ్యత. కానీ ఎవరైనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ఇష్టపడకపోతే.. వారిని బలవంతం చేయం’ అని తెలిపారు.