Asianet News TeluguAsianet News Telugu

ఇంతకీ వంశిక ఎవరు? ఆమె మీమ్స్ ఎందుకు వైరల్ గా మారాయి ?

ఇటీవలీ కాలంలో వంశిక అనే అమ్మాయి ఆడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆమె తన స్నేహితురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ..  తన బ్రేక్-అప్ సోర్టీని పంచుకున్నది. అయితే.. ఆ బ్రేకప్ స్టోరీ భావోద్వేగంతో పాటు ఫన్నీగా ఉండటంతో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు చాలా ఫన్నీ మీమ్స్ తో రియాక్షన్ అవుతూ .. ఆ కాల్ రికార్డింగ్ వీడియోను షేర్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. 

Who is Vanshika? Why are Vanshika memes trending online?
Author
First Published Dec 10, 2022, 12:32 PM IST

నెట్టింట్లో ఏది ఎలా వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. కొన్ని వీడియోలకు క్షణాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్.. లక్షలాది షేర్స్ వస్తాయి. అలాంటి కేటగిరీకి చెందిందే.. వంశిక బ్రేకప్ సోర్టీ. ఈ మధ్య కాలంలో వంశిక అనే అమ్మాయికి సంబంధించిన కాల్ రికార్డింగ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. తన బ్రేకప్ స్టోరీని తన స్నేహితురాలితో పంచుకున్న విధానం భావోద్వేగంతో పాటు ఫన్నీగా ఉండటంతో  వైరల్ గా మారింది. అప్పటి నుండి ఇంతకీ వంశిక ఎవరు? అని సోషల్ మీడియాలో జనాలు వెతుకుతున్నారు. వంశికను ఎవరూ చూడలేదు. కానీ.. బ్రేకప్ అయిన వైరల్ అవుతున్న ఆమె విషాద కథను మాత్రమే విన్నారు. ప్రస్తుతం నెట్టింట్లో వంశిక పేరు చర్చనీయాంశంగా మారింది.  

వైరలవుతోన్న కాల్ రికార్డింగ్..

డిసెంబర్ 8న ట్విట్టర్‌లో షేర్ చేసిన వంశిక కాల్ రికార్డింగ్ వీడియో షేర్ చేయబడింది. గంటల వ్యవధిలోనే 1 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. వంశిక అనే అమ్మాయి తన భర్తతో ఎలా విడిపోయానో చెప్పేందుకు తన స్నేహితురాలికి ఫోన్ చేయడం ఆ వీడియోలో చూడవచ్చు. ఆ సమయంలో తమ రెండు నెలల వార్షికోత్సవం సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్..తనని విడిచిపెట్టాడనీ, ఆ విషయం హృదయవిదారకంగా ఉందని ఆ వీడియో చెప్పడం వినవచ్చు.

అది బ్రేకప్ సంబంధించిన ఆడియో క్లిప్ అయినా.. ఆమె తన బ్రేకప్ స్టోరీని తన స్నేహితురాలితో పంచుకున్న విధానం భావోద్వేగంతో పాటు ఫన్నీగా ఉంటుంది. తన రెండు నెలల వార్షికోత్సవంలో తన ప్రియుడి కోసం చాలా చేశానని, తాను ఖరీదైన హీల్స్ కొన్నానని చెప్పడం. పార్లర్‌కి వెళ్లి వాక్సింగ్‌ చేయించుకుని చాలా బాధపడ్డాననీ, చివరకు ఆమె బాయ్‌ఫ్రెండ్ తన గురించి ఖచ్చితంగా తెలియదని , తాను పార్లర్ సిబ్బంది ముందు అరిచానని వంశిక తన ఫ్రెండ్ కు ఫోన్ కాల్‌లో చెప్పడం వినవచ్చు.  

ఇంతకీ వంశిక ఎవరు?

వంశిక అనే ఈ అమ్మాయి సంభాషణ చాలా వైరల్ అయిన నాటి నుంచి నెటిజన్లు ఆమె కోసం సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు. ఈ వంశిక ఎవరో తెలుసుకోవాలని జనాలు తహతహలాడుతున్నారు. కానీ.. వంశిక అనే ఈ అమ్మాయి గురించి నిర్దిష్ట సమాచారం మాత్రం నెట్టింట్లో లేదు.  

వైరల్ అవుతున్న మీమ్స్‌ 

షేర్ చేసిన  కొద్దిసేపటికే.. వీడియో వైరల్‌గా మారింది. వంశిక ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ లో నిలిచింది. వంశిక బ్రేకప్ స్టోరీ విన్న యూజర్లు సోషల్ మీడియాలో మీమ్స్ చేయడం మొదలుపెట్టారు. ట్విటర్‌లో ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ..ఇది చాలా హాస్యాస్పదమైన బ్రేకప్ సెషన్ అని అన్నారు. మరో నెటిజన్ ..  వంశిక బ్రేకప్ స్టోరీ విన్న తర్వాత..కంగనా రనౌత్ ఫోటోను పెట్టి తన బ్రేకప్ సోర్టీని పంచుకున్నాడు.

ఆ ఫోటోలో కంగనా విపరీతంగా ఏడుస్తుంది. నా జీవితం చాలా దారుణంగా మారింది. అని అందులో పేర్కొనబడింది. మరో నెటిజన్ .. యా అల్లా .. 2 నెలల వార్షికోత్సవం కూడా ఉందా? అని ప్రశ్నించాడు.  వంశిక లాంటి అమ్మాయిని ఇప్పటి వరకు చూడలేదని ఓ యూజర్ అంటున్నాడు. అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా ఈ ఆడియో క్లిప్ నెట్టింట్లో నవ్వుల పువ్వులు పూయిస్తుంది.   

Follow Us:
Download App:
  • android
  • ios