పాతబస్తీలో రోహింగ్యాలు, విదేశీయులు ఉంటే రాసిమ్మంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ స్పందించారు. తానెందుకు రాసివ్వాలంటూ అసదుద్దీన్ నిలదీశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికకు ఇంకా ఒక్కరోజే మిగిలింది. అయితే.. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీకి చెందిన ప్రముఖులను ప్రచారానికి రంగంలోకి దింపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
కాగా.. ఈ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో రోహ్యాంగాలు ఉన్నారంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో 30వేల మంది రోహింగ్యాలు ఉంటే అమిత్ షా నిద్రపోతున్నారా అంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
పాతబస్తీలో రోహింగ్యాలు, విదేశీయులు ఉంటే రాసిమ్మంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ స్పందించారు. తానెందుకు రాసివ్వాలంటూ అసదుద్దీన్ నిలదీశారు. ఈ సందర్భంగా అమిత్ షా పాతబస్తీలో ఉన్న రొహింగ్యాల గురించి వ్యాఖ్యలు చేయగా మజ్లీస్ అధినేత పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.
రోహింగ్యాలను తరమికొట్టడానికి అమిత్ షాకి ఎవరి అనుమతి కావాలంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో పాకిస్తానీలు, ఆప్ఘనిస్తానీలు ఉంటే.. వారిని తరిమికొట్టేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి.. ఓ ఎంపీని అనుమతి అడుగుతారా అని ప్రశ్నించారు. నిజంగా హైదరాబాద్ లో 30వేల మంది రోహింగ్యాలు ఉంటే.. అమిత్ షా ఢిల్లీలో నిద్రపోతున్నారా అంటూ సెటైర్లు వేశారు.
