Sukesh Chandrashekhar: ఎక్కడో తీహార్ జైల్లో ఉండి.. అటు ఢిల్లీ రాజకీయాలతో పాటు.. ఇటు గల్లీ (తెలంగాణ) రాజకీయాల్లో చిచ్చు రాజేసిన సుఖేష్ చంద్రశేఖర్ ఎవరు? ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకున్న లిక్కర్‌స్కామ్‌లో తన వరుస లేఖలతో ప్రకంపనాలను తెర తీసిన సుఖేష్ చంద్రశేఖర్ ఎవరు ? ఆయన లైఫ్ సోర్టీ ...
Sukesh Chandrashekhar: మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. తాజాగా 5 పేజీలతో మరో లేఖ విడుదల చేశాడు . ఈ సారి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేశారు. కవిత
ఫోన్ నెంబర్లు ఉన్న స్క్రీన్ షాట్ విడుదల చేశాడు. తీహార్ క్లబ్ కు వస్తున్నారంటూ కవిత, కేజ్రీవాల్‌కు సుఖేష్ స్వాగతం పలికారు. త్వరలోనే కేజ్రీవాల్‌తో జరిపిన చాట్స్‌ను కూడా విడుదల చేస్తానంటూ మరో బాంబు పేల్చారు. దేశ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో చిచ్చుపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్ ఎవరు ? అతని బ్యాక్ రౌండ్ ఏంటీ? సుఖేష్ సెంటర్ గా BRS-BJP మధ్య హైవోల్టేజ్ డైలాగ్ వార్ షురూ కావడానికి కారణమేంటీ?
ఇంతకీ సుఖేష్ చంద్రశేఖర్ ఎవరు ?
సుఖేష్ చంద్రశేఖర్ .. ఓ ఆర్థిక మోసగాడు. ఎక్కడో తీహార్ జైల్లో ఉండి.. అటు ఢిల్లీ రాజకీయాలతో పాటు.. ఇటు గల్లీ (తెలంగాణ) రాజకీయాల్లో చిచ్చు రాజేసిన మోసగాడు. ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకున్న లిక్కర్‌స్కామ్‌లో తన వరుస లేఖలతో ప్రకంపనాలను తెర తీశాడు. సుఖేష్ చంద్రశేఖర్ .. 200 కోట్ల ఛీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు, తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీ, ఆర్థిక నేరగాడు, మాయగాడు, మోసగాళ్లకే మోసగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. సుఖేష్ చంద్రశేఖర్ నేరాల చిట్టా మామూలుగా లేదు.
2017 నుంచి జైల్లోనే ఉన్నా.. దేశరాజకీయాలను కుదిపేస్తన్నాడు. ఢిల్లీ అసెంబ్లీలో మొదలు పెట్టి.. తెలంగాణ భవన్ వరకూ షేక్ చేస్తున్నాడు. జైలు నుంచే వరుసగా లేఖలు విడుదల చేస్తూ..పలువురిపై సంచలన ఆరోపణలు చేశాడు. కేవలం 17 ఏళ్లకే మోసం చేశాడనే ఆరోపణలతో జైలు పాలైన సుకేష్ చంద్రశేఖర్ జీవితం ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది. రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ తారల వరకు అందరినీ మోసం చేశాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి వంటి ఎందరో నటీమణులకు సుకేష్ చంద్రశేఖర్ కోట్ల రూపాయలను సమర్పించినట్టు ఆరోపణలున్నాయి. ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఓ సారి ఈ సోర్టీని చదివేయండి.
కుటుంబ నేపథ్యం
సుఖేష్ బెంగళూరులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో 1989లో జన్మించాడు. ఆయన తండ్రి ఓ చిన్న కాంట్రాక్టర్. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించే వాడు. ఇక సుఖేష్ చదువు విషయానికి వస్తే.. పాఠశాల విద్యను బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్, బెంగళూరులో అభ్యసించారు. కళశాల విద్యను మధురై యూనివర్సిటీలో.. కానీ మిడిల్ డ్రాప్. ఆయన పుస్తకాల కంటే.. సమాజాన్ని చాలా బాగా చదివాడు. సమాజంలోని లొసుగుల్లో పీహెచ్డీ చేశాడనే చెప్పాలి. ఎక్కడ ఏం చేస్తే..కాసులు కురుస్తాయి? ఎవర్ని పట్టుకుంటే.. ధన లక్ష్మి కనికరిస్తుందనే విషయాన్ని అవపోసన పట్టేశాడు. సుకేష్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగినా.. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయాలనేది ఆయన కోరిక. విలాసవంతంగా జీవించాలనే లక్ష్యంతో..మంచి,చెడులను పక్కన పెట్టి .. ఈజీ మనీ కోసం పరుగులు పెట్టాడు.

17 ఏళ్ల వయసులోనే..
2007 ఆగస్టులో సుకేష్ చంద్రశేఖర్ మొదటిసారిగా అరెస్టయ్యాడు. అప్పుడు అతని వయస్సు కేవలం 17 సంవత్సరాలు. జేడీ(ఎస్) నేత, అప్పటి సీఎం హెచ్‌డీ కుమారస్వామి కుమారుడితో స్నేహం చేస్తున్నట్టు చెప్పి 76 ఏళ్ల వృద్ధుడిని మోసం చేశాడు. బెంగుళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కస్టడీలో ఉన్న ప్లాట్‌ను తనకు ఇప్పిస్తానని రూ 1.5 కోట్లు మోసం చేశారు. మోసం చేసిన డబ్బు నుంచి 1.14 కోట్లు పార్టీలకు ఖర్చు చేశాడు.ఈ తరుణంలో తన వద్ద BMW, Nissan, Toyota Corolla, Honda City, Honda Accord వంటి ఖరీదైన కార్లను పోలీసులు గుర్తించారు. 12 ఖరీదైన వాచీలు, ఆరు మొబైల్స్, ఒకటి ధర రూ.3.40 లక్షలు. దీంతో పాటు 50 అంగుళాల ఎల్‌సీడీ టీవీ, బంగారు నగలు, డిజైనర్ దుస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సుఖేష్ చంద్రశేఖర్‌కి ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం.
2011 ఏప్రిల్‌లో సుకేష్‌ని మరోసారి అరెస్టు చేశారు. ఈసారి అప్పటి సీఎం బీఎస్ యడ్యూరప్ప కార్యదర్శిగా పదుల సంఖ్యలో వ్యాపారులను మోసం చేసి కోట్లకు పడగలెత్తాడు. తర్వాత కింగ్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీని ప్రారంభించి ఇన్వెస్టర్ల నుంచి రూ.2000 కోట్లకు పైగా మోసం చేశాడు. అప్పుడు సుకేష్‌ను పట్టుకున్న జట్టుకు డిప్యూటీ కమిషనర్ డి.దేవరాజ్ నాయకత్వం వహిస్తున్నాడు. సుకేష్ అరెస్టు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'సుకేష్ చంద్రశేఖర్ తన పాఠశాల రోజుల నుండి హై-ఎండ్ కార్లు, విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడేవాడు. సుకేష్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సుకేష్‌కు జాతీయ గుర్తింపు తెచ్చిన కేసు తర్వాత ఈ వాహనాలను సీజ్ చేశారు.

2012లో ఓ టెక్స్ టైల్ గ్రూప్ అతనిపై చీటింగ్ కేసు పెట్టడంతో ఆయన సమయంలో కొచ్చి వదలి పారిపోయాడు. ఈ కేసు కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొచ్చికి చెందిన ఇమ్మాన్యుయేల్ సిల్క్స్ ప్రమోషనల్ ఈవెంట్ కోసం నటి కత్రినా కైఫ్‌ను తీసుకువస్తానని చంద్రశేఖర్ హామీ ఇచ్చి, దాని కోసం కంపెనీ నుంచి రూ.20 లక్షలు తీసుకున్నాడు. అప్పటికే సుకేష్ చంద్రశేఖర్ జైలుకు అలవాటు పడ్డాడు. పదే పదే అరెస్ట్ కావడం, బెయిల్‌పై రావడం అతడికి నిత్యకృత్యంగా మారింది. 2009లో అతను లీనా మారియా పాల్‌ను కలిశాడు. లీనాను మోసం చేయడంలోనే కాదు, ఆమెను తన భాగస్వామిగా చేసుకున్నాడు.
2013లో మరోసారి అరెస్టయ్యారు. చెన్నైలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్‌తో పాటు జలీనా, చంద్రశేఖర్ అనే వ్యాపార జంటను మోసం చేసినందుకు అరెస్టయ్యారు. వ్యాపార జంటకు తాము కర్ణాటక ప్రభుత్వ అధికారులమని చెప్పుకుని శానిటరీ న్యాప్‌కిన్ డిస్పెన్సేషన్ మెషీన్ ఒప్పందం ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుంచి రూ.19 కోట్లు తీసుకున్నారు. రూ.19 కోట్లు పెట్టుబడి పెడితే కర్ణాటక అంతటా శానిటరీ న్యాప్‌కిన్‌లు పంపిణీ చేసేందుకు రూ.132 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తానని మాయమాటలు చెబుతారు. ఆ దంపతులు కెనరా బ్యాంకులో రుణం తీసుకుని డబ్బు బదిలీ చేశారు. మోసాన్ని గుర్తించకముందే ఇద్దరి ఖాతాలో రూ.12 కోట్లు మాయమయ్యాయి.
50 కోట్ల లంచం కేసు
2017లో, వీకే శశికళ, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఐడీఎంకే వర్గానికి రెండు ఆకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్ల లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన చంద్రశేఖర్‌ను దక్షిణ ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతని వద్ద నుంచి లంబోర్గిని, పోర్షే కయెన్, జాగ్వార్, రేంజ్ రోవర్, బెంట్లీ, బిఎమ్‌డబ్ల్యూ, రోల్స్ రాయిస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, డుకాటి మోటార్‌సైకిల్ వంటి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఉచ్చుగా మారిన రూ.200 కోట్ల మోసం కేసు
ఇలా తరుచు జైలుకు వెళ్లి రావడంతో సుకేష్ చంద్రశేఖర్ కు ధైర్యం పెరిగింది. 2021 లో అతిపెద్ద దోపిడీకి ప్లాన్ వేశారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ వద్ద ‘లా సెక్రటరీ’గా నటిస్తూ రూ.200 కోట్లు మోసం చేశాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఒకవేళ తన భర్తపై ఉన్న కేసులను పరిష్కరించేందుకు సహాయం చేస్తానని ఆ వ్యక్తి అదితికి చెప్పాడంట. వారు 'పార్టీ ఫండ్'కి విరాళం ఇస్తారు. ఈ కేసులో అరెస్టయిన సుకేష్‌ను ఢిల్లీలోని రోహిణి జైలులో ఉంచారు. ఆ తర్వాత ఆ కేసును ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)కి బదిలీ చేశారు.
జైళ్లో కూడా ఆగని లీలలు ..
జైళ్లో కూడా అతని లీలలు అడ్డులేకుండాపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే..సుకేష్.. జైలు అధికారులతో కూడా డీల్ చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. జైళ్లో కూడా విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్టు ఆరోపణలున్నాయి. అతని కోసం ప్రత్యేక బ్యారక్. మొబైల్ ను వినియోగించుకునే వీలు కల్పించినందుకు జైలు అధికారులకు ప్రతినెలా రూ.1.5 కోట్లు చెల్లించాడంట. ఈ కేసులో 82 మంది జైలు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు నటీమణులు చిక్కుకున్నారు.
అనంతరం ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు నటీమణులతో సుఖేష్ చంద్రశేఖర్‌కు ఉన్న సంబంధాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వెల్లడించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో సుకేష్ సన్నిహిత చిత్రాలు ఉన్నాయి. సుకేష్ తన కుటుంబానికి సహాయం చేశాడని జాక్వెలిన్ విచారణలో అంగీకరించింది. వారికి ఖరీదైన బహుమతులు ఇచ్చేవాడు.
అయితే సుకేష్ కేసులో నిజమెంతో తనకు తెలియదని జాక్వెలిన్ పేర్కొంది. తనపై అనుమానం వచ్చిన వెంటనే జాక్వెలిన్ ను దూరంపెట్టాడంట. మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నటీమణులు నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లీనా, పాల్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టాడు సుకేష్ చంద్రశేఖర్. వారికి చాలా ఖరీదైన బహుమతులిచ్చినట్టు గుర్తించారు.

జాక్వెలిన్ ,ఆమె కుటుంబం కోసం సుకేష్ 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు ED పేర్కొంది. చెన్నైలో జాక్వెలిన్‌ను నాలుగుసార్లు కలిశాడనీ, చార్టర్డ్ విమానంలో 8 కోట్లు ఖర్చు చేసినట్టు గుర్తించారు. అలాగే..నోరా ఫతేహికి BMW, ఖరీదైన ఫోన్‌ను ఇవ్వడానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అలాగే 52 లక్షల విలువైన గుర్రం, 9 లక్షల విలువైన పెర్షియన్ పిల్లి ఇచ్చినట్టు గుర్తించారు. అంతేకాదు..జాక్వెలిన్‌కి సుకేష్ హాలీవుడ్ సినిమా ఆఫర్ కూడా ఇచ్చాడట
సత్యేందర్ జైన్‌పై సంచలన ఆరోపణలు
మీడియా కథనాల ప్రకారం.. సుకేష్ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా ఎల్జీ వీకే సక్సేనాకు చేతితో రాసిన లేఖను పంపారు. అందులో, '2017లో నన్ను అరెస్టు చేసిన తర్వాత నన్ను తీహార్ జైలులో మార్చారు. ఈ తరుణంలో జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న శ్రీ సత్యేందర్ జైన్ నన్ను కలవడానికి చాలాసార్లు వచ్చారు. 2019లో జైన్ మళ్లీ వచ్చాడు. అతని సెక్రటరీ నాకు రక్షణ సొమ్ము పేరుతో ప్రతి నెలా రూ.2 కోట్లు ఇవ్వాలని అడిగాడు. అందుకు ప్రతిగా జైలులో సౌకర్యాలు కల్పించాలని చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు.

