పార్లమెంట్ దాడి వెనకున్న 'మాస్టర్ మైండ్' లలిత్ ఝా ఎవరంటే...
పార్లమెంట్ దాడి ఘటనలో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా గురువారం న్యూ ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయనకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
న్యూఢిల్లీ : పార్లమెంటుపై దాడి ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా, చెకింగులు ఉండే పార్లమెంటులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు.. విజిటర్స్ గ్యాలరీలోనుంచి సభలోకి దూకడం.. రంగుల పొగను వదలడం.. కుర్చీలమీదినుంచి పరుగులు పెట్టడం తీవ్ర భయాందోళనలు కలిగించింది. ఈ ఘటనతో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటను సూత్రధారి లలిత్ ఝా అనే వ్యక్తి అని తేల్చారు. ఘటన తరువాత లలిత్ ఝా పరారీలో ఉన్నాడు. అతనికోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. గురువారం లలిత్ ఝా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
లోక్ సభలో భద్రతా ఉల్లంఘన.. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా అరెస్టు..
లలిత్ ఝాకు సంబంధించిన 5 ముఖ్యమైన విషయాలివే..
ఘటన జరిగినప్పటి నుంచి లలిత్ ఝా కనిపించకుండా పోయాడు. బీహార్‌కు చెందిన లలిత్ ఝా కోల్‌కతాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. గురువారం పార్లమెంటు సమీపంలోని కర్తవ్య పథ్‌లో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఆయన లొంగిపోయాడు.
పార్లమెంటుపై దాడి ఘటనలో ఐదుగురు పురుషులు, ఒక మహిళపై ఉగ్రవాద నిరోధక చట్టం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం ఉపా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
లలిత్ ఝా స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ నుంచి స్ఫూర్తి పొందారని పోలీసులు తెలిపారు. నిందితులు పార్లమెంటు వెలుపల పొగ డబ్బాలను వేసిన వీడియోలను చిత్రీకరించారని, మీడియా కవరేజీని పొందేలా వీడియోలను ఒక ఎన్జీవో వ్యవస్థాపకుడికి అందించాడు. వాటిని మీడియాలో వచ్చేలా చూడమని కోరాడు. లలిత్ ఝా నీలాక్ష ఐచ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఎన్జీవో కు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ సంఘటనవీడియోలను జాగ్రత్తగా ఉంచడం కోసం అతనికి పంపాడు.
లలిత్ ఝా తనపని తాను చూసుకుంటూ.. ఎవ్వరితోనూ కలవకుండా ఉండే కామ్ గోయింగ్ వ్యక్తి. స్థానిక విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒంటరిగా కోల్‌కతాలోని బుర్రాబజార్‌కు వచ్చాడు. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుండేవాడు. రెండేళ్ల క్రితం హఠాత్తుగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ వివరాలను అక్కడున్న ఓ టీ స్టాల్ యజమాని పీటీఐకి చెప్పారు.
బుధవారం, ఇద్దరు వ్యక్తులు సాగర్, మనోరంజన్ - బిజెపి ఎంపి కార్యాలయం జారీ చేసిన పాస్‌లతో పార్లమెంట్ లోకి ప్రవేశించారు. తర్వాత పార్లమెంటులోకి స్మోక్ బాంబులను అక్రమంగా రవాణా చేశారు. సందర్శకుల గ్యాలరీ నుండి లోక్‌సభలోకి దూకారు. వారిని పట్టుకోవడానికి ఎంపీలు ప్రయత్నించారు. దీతో వారు స్మోక్ వదిలారు. నీలం దేవి, అమోల్ షిండే అనే మరో ఇద్దరికి పాస్ దొరకలేదు. దీంతో వారు పార్లమెంటు భవనం వెలుపల నినాదాలు చేస్తూ, స్మోక్ బాక్సులు విసురుతూ నిరసన చేపట్టారు.
- Indian Parliament Security
- Lalit Jha
- Lok Sabha
- Lok Sabha security breach
- Major security breach
- Major security breach in Lok Sabha
- Mastermind
- Parliament
- Parliament Attack 2023
- Parliament Attack Anniversary
- Parliament Security
- Parliament Security Breach
- Parliament Winter Season
- Parliament attack
- Parliament attack 2001
- Security Breach. Security Breach in Lok Sabha
- attack on parliament
- parliament attack
- parliament smoke attack latest
- parliament smoke attack news
- parliament smoke attack suspects
- smoke cans
- visitor's gallery