భార‌త ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌గా అరుణ్ గోయ‌ల్ సోమవారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మే నెల‌లో సుశీల్ చంద్ర రిటైర్ కావ‌డంతో ఓ పోస్టు ఖాళీగా ఉంది. సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత అనుప్ చంద్ర పాండే మ‌రో క‌మీష‌న‌ర్‌గా ఉన్నారు.

నూతన ఎన్నికల కమిషనర్‌గా మాజీ బ్యూరోక్రాట్ (ఐఏఎస్) అరుణ్ గోయల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గోయల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇటీవల నవంబర్ 18న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అతడి పదవికాలం డిసెంబర్ 31, 2022 వరకు ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేతో పాటు అరుణ్ గోయెల్ ఎన్నికల కమిషన్‌లో భాగమయ్యారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) సుశీల్ చంద్ర మే 14న పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవి ఖాళీగా ఉంది. దీంతో రాజీవ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ప్రత్యేకత.. 

>> అరుణ్ గోయల్ తన స్వచ్ఛంద పదవీ విరమణ వరకు భారీ పరిశ్రమల కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు కేంద్ర సాంస్కృతిక శాఖలో పనిచేశారు.

>> అరుణ్ గోయల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 60 ఏళ్ల వయసులో డిసెంబర్ 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా గత శుక్రవారం స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 

>> గుజరాత్‌లో ఎన్నికలకు రెండ్రోజుల ముందు అరుణ్ గోయల్ నియామకం జరిగింది. గుజరాత్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ పోటీ నెలకొంది.

>> చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా అరుణ్ గోయల్ కూడా బరిలోకి దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి 2025 వరకు రాజీవ్ కుమార్ పదవీలో కొనసాగునున్నారు.

>> అరుణ్ గోయల్ బాధ్యతలు స్వీకరించడంతో.. వచ్చే ఏడాది ఎన్నికల షెడ్యూల్‌ను నిర్ణయించే పూర్తి అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది. తదుపరి సంవత్సరం కర్ణాటక, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

>> గోయల్ పాటియాలా నివాసి.అతని తండ్రి పంజాబీ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రొఫెసర్. గోయల్ మొదటి నుండి చదువులో చాలా తెలివైనవాడు. పాటియాలాలోని మోడీ కాలేజీలో బిఎలో టాపర్. ఆయన ఐఏఎస్ అయిన తర్వాత..

>> గోయల్ పంజాబ్‌లోనే కాకుండా కేంద్రప్రభుత్వంలో కూడా ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ఈ తరుణంలో కేంద్రం ఆయ‌నకు ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ చేసి..నూతన బాధ్య‌తలిచ్చింది.