న్యూడిల్లీ: వందకోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశంలో కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కష్టమయినప్పటికీ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శక్తివంచన లేకుండా అందుకోసం ప్రయత్నించిందని ఇప్పటికే వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇలాంటి అబిప్రాయాన్నే వ్యక్తం చేసింది. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 

''భారత ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి వున్న నిబద్దతకు ధన్యవాదాలు. అయితే మనమిద్దరం( భారత్, ప్రపంచ ఆరోగ్య సంస్థ) కలిసి ఉమ్మడిగా బలగాలను మరియు వనరులను సమీకరించుకుంటే కరోనా మహమ్మారిని అంతం చేయగలము'' అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ ట్వీట్ చేశారు.