‘ఇండియన్ వేరియంట్’ విషయంలో మేము అలా చెప్పలేదు.. డబ్ల్యూహెచ్ఓ
వైరస్ లు, వాటి వివిధ రూపాలను అవి మొదట కనిపించిన దేశాల పేర్లతో గుర్తించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. వాటి శాస్త్రీయ పేర్లతోనే ప్రస్తావిస్తూ ఉన్నామని తెలిపింది. వీటికి ఒకే విధమైన పేరు ఉండడం కోసం అందరూ ఇదే పద్ధతిని అనుసరించాలని కోరింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా విభాగం బుధవారం ఓ ట్వీట్ చేసింది.

అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే స్పష్టతనిచ్చింది. ఇండియన్ కోవిడ్ 19 వేరియంట్ 44 దేశాల్లో కనిపించిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వేరియంట్ ను డబ్ల్యూహెచ్ఓ ‘ఇండియన్’ అని వర్గీకరించలేదని తెలిపింది. ఈ అంశంమీద విడుదల చేసిన నివేదికలో ‘ఇండియన్’ అనే పదాన్ని డబ్ల్యూహెచ్ఓ వాడలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
డబ్ల్యూహెచ్వో విడుదల చేసిన నివేదికలో B.1.617 వేరియంట్ ప్రపంచానికి ఆందోళనకరమని తెలిపింది. అయితే చాలా వార్తా కథనాలు ఈ రకాన్ని ఇండియన్ వేరియంట్ గా అభివర్ణిస్తూ ఉన్నాయి .అయితే ఇది నిరాధారమని ఎటువంటి ప్రాతిపదిక లేనిదని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో గుర్తించినవాటి తర్వాత అంత ఆందోళన కలిగించే నాలుగో వేరియంట్ ఇదే అని తెలిపింది. ఇది ఒరిజినల్ వైరస్ కన్నా చాలా సులువుగా వ్యాపిస్తున్నట్లు కనిపిస్తుండటం వల్ల దీనిని ఈ జాబితాలో చేర్చినట్లు తెలిపింది.
B.1.617 వేరియంట్ను డబుల్ న్యూటన్ కూడా పిలుస్తున్నారు. ఇది యాంటీబాడీస్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడానికి కారణం ఈ వేరియంటేనని భావిస్తున్నారు. ఈ వేరియంట్ ను 44 దేశాల్లో దాదాపు 4,500 శాంపిల్స్ తో గుర్తించినట్లు తెలుస్తోంది.
డబుల్ మ్యుటెంట్ వైరస్‌ను 2020 అక్టోబర్ 5న మొదటిసారి గుర్తించారు. అది మన దేశంలో విస్తృతంగా వ్యాపించలేదు. మార్చి- ఏప్రిల్ మధ్య కాలంలో మన దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి, ఈ వేరియంట్‌కు మధ్య సంబంధాన్ని కేంద్ర ప్రభుత్వం రూఢి చేయలేదు. ఇది ఒక కారణం కావచ్చునని మాత్రమే చెప్పింది. వైరస్‌లో వేరియంట్లు సహజమేనని, కొన్ని రకాలు మిగిలినవాటికన్నా శక్తిమంతంగా ఉండవచ్చునని తెలిపింది.