Asianet News TeluguAsianet News Telugu

ప్రియురాలి శవం ఫ్రిడ్జ్ లో ఉండగానే.. మరో యువతిని ఇంటికి పిలిచి డేటింగ్.. క్రైం సిరీస్ చదివి శరీరం ముక్కలు...

సహజీవనం చేస్తున్న మహిళను గొంతుకోసి హత్యచేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆఫ్తాబ్.. ఫ్రిడ్జ్ లో శరీరభాగాలు ఉండగానే మరో మహిళను ఇంటికి తీసుకువచ్చి డేటింగ్ చేశాడని తేలింది. 

While Shraddhas Body Remained in Fridge, Aaftab Made Love to Several Women says Delhi Police
Author
First Published Nov 15, 2022, 12:50 PM IST

ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వికాస్ వాకర్ హత్య కేసులో దిగ్భ్రాంతి గొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఆఫ్తాబ్  ఓ పక్క ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్లో ఉంచి..  మరో యువతిని పలుమార్లు తన అపార్ట్ మెంట్ కు పిలిచినట్లు తేలింది. మరోవైపు ఓ వెబ్ సిరీస్ ను ఇంటర్నెట్లో చదివి.. శవాన్ని ఆనవాలు లేకుండా  మాయం చేశాడని పోలీసులు గుర్తించారు. అంతేకాదు, డేటింగ్ యాప్ ను వాడి పలువురు మహిళలను కూడా అతడు కలిసినట్లు తెలుస్తోంది. అతడి స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇతరులు.. తరచుగా ఇంటికి వస్తున్నా… ఇంట్లో కొన్నాళ్ల నుంచి మృతదేహం విడిభాగాలు ఉన్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త వహించాడు.

డెక్స్ టర్ వెబ్ సిరీస్  చూసి…
నిందితుడు ఆఫ్తాబ్ ‘డెక్స్ టర్’ పేరిట వచ్చే ఓ సీరియల్ కిల్లర్ ఆంగ్ల వెబ్ సిరీస్, ఇతర క్రైం సిరీస్ లను చూసేవాడు. మే 18వతేదీన శ్రద్ధా- ఆఫ్తాబ్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆఫ్తాబ్ ఆమెను గొంతు కోసి చంపాడు. ఆ తరువాత అతను చూసే క్రైమ్ షోల్లో లాగా, ఆమె మృతదేహాన్ని నరికి, ఫ్రిజ్లో భద్రపరిచాడు. శరీరాన్ని ముక్కలు చేయడం కోసం అతడు హ్యూమన్ అనాటమీ చదివాడు. 

దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి.. 35 ముక్కలుగా కోసి, నగరమంతా చల్లి...

ఇంట్లో ఎటువంటి వాసన రాకుండా రోజూ అగరబత్తీలు వెలిగించేవాడు. ఫ్రిజ్లో దాచి పెట్టిన ఆమె ముఖాన్ని అప్పుడప్పుడు తీసి చూసేవాడు. త్వరగా దెబ్బతింటున్న శరీర భాగాలను మొదట పారేసేవాడు. పోలీసులు  అతను వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. రక్తాన్ని ఎలా శుభ్రం చేయాలి,  మానవ శరీర నిర్మాణం  ఎలా  ఉంటుంది..  అనే అంశాలను అతను చదివినట్లు గూగుల్ హిస్టరీలో బయటపడింది.

మరో యువతి గాలం…
శ్రద్ధ శవం ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఉండగానే.. ఆఫ్తాబ్ మరో యువతిని తన అపార్ట్ మెంట్ కు తీసుకువచ్చాడు. ఆఫ్తాబ్ ఈ విషయాన్ని విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఓ ఆన్లైన్ డేటింగ్ యాప్ ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాడు. గతంలో ఇదే యాప్ లో శ్రద్ధాతో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ యాప్ లోనే మరో యువతికి ఎరవేశాడు. ఆమె ఓ సైకాలజిస్ట్. ఆమె జూన్, జూలైలో పలుమార్లు అతడు ఇంటికి వచ్చి వెళ్ళింది. అప్పటికి ఆ అపార్ట్మెంట్ కిచెన్ లోని ఫ్రిజ్ లో శ్రద్ధా శరీర అవయవాలు ఇంకా ఉన్నాయి.

మరోవైపు శ్రద్ధ సజీవంగా ఉందని అందరినీ నమ్మించేందుకు ఆఫ్తాబ్ ఆమె సోషల్ మీడియా అకౌంట్లోకి లాగిన్ అయ్యేవాడు. దీంతోపాటు ఆమె క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించేవాడు. కొన్ని సందర్భాల్లో ఆమె మిత్రులకు మెసేజీలు చేసేవాడు. కాకపోతే ఫోన్ స్విచాఫ్ రావడం, సోషల్ మీడియా అప్డేట్ లేకపోవడం వంటి వాటితో శ్రద్ధ మిత్రులకు  అనుమానం వచ్చి ఆమె ఇంట్లో తెలిపారు.

నన్ను రక్షించు.. చంపేస్తాడేమో..
శ్రద్ధా బతికున్న సమయంలో ఒకసారి తను రక్షించాలంటూ మిత్రుడికి మెసేజ్ పంపింది. ఆమె మిత్రుడు లక్ష్మణ్ అనే వ్యక్తి ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ‘ఒకసారి ఆమె వాట్సాప్ నుంచి నాకు ఓ మెసేజ్ పంపించింది. ఆమె ఇంటి నుంచి ఆమెను రక్షించాలని కోరింది. ఒకవేళ ఆ రాత్రి అక్కడే ఆమె ఉంటే అతడు ఆమెను చంపేసేవాడు’ అని  నాడార్ చెప్పాడు. అప్పట్లో తన మిత్రులను తీసుకుని అక్కడికి వెళ్లి ఆమెను రక్షించానని పేర్కొన్నాడు. కానీ శ్రద్ధాకు ఆఫ్తాబ్ పై ప్రేమతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నాడు కానీ కొన్నాళ్లుగా శ్రద్ధ నుంచి ఎటువంటి మెసేజ్ లు రాకపోవడం, ఫోన్లకు స్పందించకపోవడంతో ఆమె సోదరుడికి విషయం చెప్పామని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios