Asianet News TeluguAsianet News Telugu

మహిళల టీ20 మ్యాచ్‌ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి క్యూట్ డాగ్.. బంతితో పరుగులు.. వీడియో ఇదే

మహిళా జట్టులు టీ20 మ్యాచ్ ఆడుతుండగా ఉన్నట్టుండి ఓ క్యూట్ డాగ్ గ్రౌండ్‌లోకి దూకేసి ఆ బంతి వెంట పరుగులు పెట్టింది. బంతిని నోట కరుచుకుని ఫీల్డర్లను తన వెంట తిప్పుకున్నది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నది.

while ireland women teams playing t20 match dog entered into the ground
Author
New Delhi, First Published Sep 12, 2021, 5:07 PM IST

న్యూఢిల్లీ: ఆ మహిళల టీ20 మ్యాచ్ హోరాహోరీగా జరుగుతున్నది. అందరూ మహిళా బ్యాటర్ బాదడంతో బంతి బార్డర్ వైపు దూసుకెళ్తున్నది. ఇక్కడ ఎదురైన ట్విస్టు ఉభయ జట్లను, ప్రేక్షకులను అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఓ క్యూట్ డాగ్ ఆ బంతి పట్టుకోవడానికి గ్రౌండ్‌లోకి దూకి దాని వెంటే పరుగెత్తింది. ఫీల్డర్లకు అందకుండా బంతిని నోటితో కరుచుకుని పరుగులు పెట్టింది. చివరికి రన్నర్‌గానున్న బ్యాట్‌వుమన్ దగ్గరకు బంతిని తీసుకెళ్లింది. అప్పటికే బయటి నుంచి స్టాఫ్ వచ్చి ఆ డాగ్‌ను వెంటబెట్టుకుని బయటికెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో చూస్తూ అందరూ సరదాగా నవ్వుకుంటున్నారు.

ఐర్లాండ్ మహిళా టీమ్‌లు టీ20 మ్యాచ్ ఆడుతుండగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. బ్రెడీ క్రికెట్ క్లబ్, ఐర్లాండ్ క్రికెట్ క్లబ్‌కు చెందిన సివిల్ సర్వీస్ నార్త్ జట్టుల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. ఇంతలో ఓ కుక్క గ్రౌండ్‌లోకి దూకింది. బ్యాట్‌వుమన్ బాదిన బంతి వెంట పరుగెత్తింది. కానీ, ఆ డాగ్ కంటే ముందే ఫీల్డర్ బంతిని కీపర్‌కు పంపారు. రనౌట్ చేయాలనే లక్ష్యంతో కీపర్ ఆ బంతిని వికెట్‌ల వైపుగా విసిరారు. ఆ బంతి వికెట్లకు తగలకుండా మళ్లీ ఆ డాగ్ వైపే వెళ్లింది.

 

ఈ సారి ఆ కుక్క బంతిని ఫీల్డర్లకు చిక్కనివ్వలేదు. ఫీల్డర్ కంటే ముందే బంతిని నోట కరుచుకుని కొద్దిసేపు గ్రౌండ్‌లో పరుగులు పెట్టించింది. చివరికి బ్యాట్‌వుమన్ దగ్గరకు వెళ్లి వదిలింది. ఫీల్డర్లు వెంటనే ఆ కుక్క దగ్గరకెళ్లి దాని బొజ్జ నిమిరారు. స్టాఫ్ పరుగెత్తుకొచ్చి ఆ డాగ్‌ను గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు. గ్రౌండ్‌లోకి కుక్క రాగానే కామెంట్రీ చేస్తున్నవారూ షాక్ అయ్యారు. తర్వాతి దాని హంగామా చూసి వారూ నవ్వకుండా ఉండలేకపోయారు. ఈ వీడియోను స్వయంగా ఐర్లాండ్ విమెన్స్ క్రికెట్ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. నెటిజన్లు ఆ కుక్కను మంచి ఫీల్డర్ అంటూ మెచ్చుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios