Asianet News TeluguAsianet News Telugu

తిరుమల కూడా తెరిచారు.. షిర్డీ సంగతేంటి: మహా సర్కార్‌ నిర్ణయంపై భక్తుల ఆశలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్‌లాక్ 2 తర్వాత వ్యాప్తి పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య 11 లక్షలు దాటిపోయింది

when shri shirdi sai babas temple opened
Author
Shirdi, First Published Jul 23, 2020, 2:50 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్‌లాక్ 2 తర్వాత వ్యాప్తి పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య 11 లక్షలు దాటిపోయింది.

రోజురోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాలుస్తోంది. అటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దేశంలోని కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో వుంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు అమలు చేస్తోంది.

దీనిలో భాగంగానే పలు ఆలయాల్లో భక్తుల దర్శనానికి అనుమతి సైతం ఇవ్వడం లేదు. కాగా, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలోకి కూడా భక్తులను తక్కువ సంఖ్యలో అనుమతి ఇస్తున్నారు.

కానీ ఇప్పటి వరకు షిర్డీ సాయిబాబా ఆలయం మాత్రం ఇంకా దర్శనాలకు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో కోవిడ్ నేపథ్యంలో భక్తులను, అనుమతించడం లేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఆలయాలు ఇప్పటికే తెరుచుకున్నందున.. ఇక్కడ కూడా అనుమతివ్వాలని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌తో పాటు స్థానికులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ట్రస్ట్ అరుణ్ డోంగ్రీ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో రెండు నెల లేదా రెండు నెలల్లో ఆలయం తెరచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయం తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చిన వెంటనే సాయిబాబా దర్శనానికి భక్తులను అనుమతిస్తామని సంస్థాన్ సీఈవో అరుణ్ డోంగ్రీ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios