ఆనాడు  స్వాతంత్య్రోదమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్రను  తెలుసుకోవడానికి భారతీయులు చాలా ఆసక్తి కనబరిచేవారు. ఈ క్రమంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సంబంధించిన వార్తలను ప్రచురించడంపై కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షాలు విధించింది. జాతీయోద్యమ పోరాటం వార్తలపై సెన్సార్‌ విధించింది. 

అది 1945.. స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. బ్రిటీష్ వారి దాస్య సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి స్వాతంత్ర సమరయోధులు తమ పోరాటాలను తీవ్రం చేశారు. అదే సమయంలో ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆంగ్లేయులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ముంబై తీరంలో గస్తీని ముమ్మరం చేసింది. ఈ తరుణంలో తీరం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించే ఓ సముద్రపు ట్రాలర్‌ను అడ్డగించింది. ఆ ట్రాలర్ మయన్మార్‌లోని యాంగోన్‌ నుంచి భారత్ కు వస్తున్నట్టు గుర్తించారు.

ఆ ట్రాలర్ పై బ్రిటీష్ అధికారుల బృందం ట్రాలర్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ఎవరూ ఊహించని విధంగా పాడైన వంటపాత్రలు, గోనె సంచులు మాత్రమే బయటపడ్డాయి. అవి గుజరాతీ ఇంజనీర్‌ బీసీ మెహతాకు చెందిన వస్తువులుగా గుర్తించారు. ట్రాలర్ తీరానికి చేరుకోగానే మెహతా తనతో పాటు బ్యాగులు, పాత్రలు అన్నీ తీసుకుని నేరుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వద్దకు వెళ్లాడు. ఇక్కడ యాంగోన్ నుండి ఓ వ్యక్తి ఆ పాడైన పాత్రలు, గోనె సంచులను తీసుకవస్తే.. వాటిని భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నతమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి వాటిని తీసుకవెళ్లడమేంటి?

ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే.. నేతాజీ సుబాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఆజాద్ హింద్ ఫౌజ్.. స్వాతంత్య్రోదమంలో కీలక పాత్రను పోషించింది. ఆ సంస్థ ప్రదర్శించిన శౌర్య ధైర్యసాహసాలు నేటీకి ఆదర్శప్రాయమే.

ఆనాడు స్వాతంత్య్రోదమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్రను తెలుసుకోవడానికి భారతీయులు చాలా ఆసక్తి కనబరిచేవారు. ఈ క్రమంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సంబంధించిన వార్తలను ప్రచురించడంపై కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షాలు విధించింది. జాతీయోద్యమ పోరాటం వార్తలపై సెన్సార్‌ విధించింది. నేతాజీ జపనీస్ ఏజెంట్ అని, ఈ సంస్థ భారతదేశంలో జపనీస్ వలసవాదాన్ని వ్యాప్తి చేసుందని, ఇండియన్ జపనీస్ ఫైటింగ్ ఫోర్స్ అని బ్రిటీష్ వారు అబద్ద ప్రచారాన్ని చేయించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫౌజ్‌ భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశించలేదు. అలాంటి చర్యలను బ్రిటిష్ వారు అడ్డుకున్నారు. 

ఈ క్రమంలో నేతాజీ ఆదేశాల మేరకు ఫౌజ్ ప్రచార యూనిట్.. యుద్ధభూమిలో సైనికుల పాత్ర , రాణి ఝాన్సీ రెజిమెంట్, తదితర విషయాలను చూపించే విధంగా ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. నేతాజీ మహాత్మా గాంధీతో తీవ్ర విభేదాల తర్వాత భారతదేశాన్ని విడిచిపెట్టారు. అయినా నేతాజీకి భారత జాతీయ కాంగ్రెస్‌లో అతని సానుభూతిపరులు,మిత్రులు ఉన్నారు. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని భారతీయ ప్రజలకు చూపించేందుకు ఈ నేతాజీ అనుకూల నాయకులు సంప్రదించారు. ఈ సమయంలో మెహతా సహాయం చేశారు. అనేక సార్లు నేతాజీని తన వాహనంలో మయన్మార్‌ కి తీసుకెళ్లారు. ఈ చిత్రానికి సంబంధించి సర్దార్ పటేల్‌ను ఆజాద్ హింద్ ఫౌజ్ సంప్రదించింది. డాక్యుమెంటరీ చిత్రాన్ని భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి తన మద్దతు ఇచ్చారు. ఆ డాక్యుమెంటరీని భారత భూభాగంలోకి తీసుకురావడానికి మెహతాకు బాధ్యత అప్పగించారు. ఆయనతో పాటు సర్దార్ పటేల్ కూడా సినిమా రీల్స్ తీసుకుని న్యూఢిల్లీకి వెళ్లారు. ఈ సినిమాను కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా చూడాలని నిర్ణయించారు. సినిమా బహిరంగ ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని సర్దార్ పటేల్ కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. ఈ సమయంలో కన్నాట్ ప్లేస్‌లోని రీగల్ సినిమా యజమాని రాజేశ్వర్ దయాల్ ను తన థియేటర్‌లో ప్రదర్శనకు అనుమతించాలని అభ్యర్థించారు. అందుకు అతడు కూడా అంగీకరించాడు. స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.

షెడ్యూల్ రోజున సర్దార్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, కాంగ్రెస్ హైకమాండ్ సభ్యులు ప్రతి ఒక్కరూ సినిమాను వీక్షించారు. ఈ ప్రదర్శన అనంతరం ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ పట్ల దృక్పథం మార్చబడింది. బ్రిటీష్ బాసిన సంకెళ్ల నుంచి మాతృభూమిని విడిపించేందుకు నేతాజీ జాతీయ మిషన్‌లో ఉన్నారని, అతను జపాన్ ఏజెంట్ అని బ్రిటిష్ వారు చేస్తున్న దుష్ప్రచారం అబద్ధమని ప్రజలు గ్రహించారు. ఈ చిత్రంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు అడవిలో శిక్షణ పొందే సన్నివేశాలు, యాంగోన్, సింగపూర్‌లోని భారతీయ మహిళలు సాహసాలు, ఝాన్సీ బ్రిగేడ్‌కు చెందిన రాణి క్రుషిని కూడా చూపించారు. బోస్ ప్రణాళికలు, ఇతర నాయకులను కలవడం, ఢిల్లీకి లాంగ్ మార్చ్ కోసం దేశ ప్రజలకు, తన కార్యకర్తలను ప్రోత్సహించడం కూడా ఇందులో చూపించారు.

ప్రదర్శన అనంతరం.. ఊహించినట్లుగానే.. చట్టాన్ని ఉల్లంఘించినందుకు బ్రిటీష్ ప్రభుత్వం నుండి నోటీసు అందుకున్నాడు కాంగ్రెస్ నాయకులు. ప్రసిద్ధ ఎర్రకోట INA ట్రయల్స్‌లో వాదించిన రాజిందర్ నరైన్ ను తనకు సహాయం చేయమని దయాళ్ కోరాడు. అతన్ని అప్పటి నగర మేజిస్ట్రేట్‌గా ఉన్న కున్వర్ మొహిందర్ సింగ్ బేడీ వద్దకు తీసుకెళ్లాలని కోరాడు. వలసరాజ్యాల చట్టం పరిధిలో దేశభక్తుడికి ఎలా సహాయం చేయాలో బేడీకి తెలుసు. తొలి విచారణ అనంతరం సుదీర్ఘ సెలవు ప్రకటించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు అతను కేసును విచారణకు జాబితా చేయలేదు. 

మరోవైపు..సర్దార్ పటేల్ తన విధేయులను నేతాజీకి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోవాలని, పూర్తి చలనచిత్రాన్ని రూపొందించాలని కోరారు. 1947లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని విడుదలైంది. ఛోటుభాయ్ దేశాయ్ దర్శకత్వం వహించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. B.C మెహతా ద్వారా యాంగోన్ నుండి అన్ని ఫిల్మ్ రీల్స్ అక్రమంగా రవాణా చేయబడ్డాయి. 1945లో సర్దార్ పటేల్ భారతదేశంలోకి అక్రమంగా తరలించిన చిత్రం నేతాజీ , ఆజాద్ హింద్ ఫౌజ్‌లకు మద్దతుగా ప్రజల అభిప్రాయాన్ని మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది INA ట్రయల్స్, పోలీసు తిరుగుబాట్లు, సైన్యం తిరుగుబాట్లు, నౌకాదళ తిరుగుబాట్లకు వ్యతిరేకంగా విస్తృత నిరసనలకు దారితీసింది. ఈ సంఘటనలన్నీ స్వాతంత్రోద్యమంలో కీలకంగా మారాయి. బ్రిటీష్ వారు భారతదేశాన్ని త్వరగా విడిచిపెట్టేలా చేశాయి. 

రచయిత - సాకిబ్ సలీం