దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు తీవ్ర అంతరాయంం ఏర్పడింది. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి

దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు తీవ్ర అంతరాయంం ఏర్పడింది. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. సందేశాలను పంపడం, స్వీకరించడం సాధ్యం కావడం లేదని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే దాదాపు గంట సేపటి తర్వాత వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా స్పందించింది. ‘‘కొంతమందికి ప్రస్తుతం సందేశాలు పంపడంలో సమస్య ఉందని మాకు తెలుసు. వీలైనంత త్వరగా అందరికీ WhatsAppని పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తున్నాం’’ అని మెటా కంపెనీ ప్రతినిధి చెప్పారు

ఇక, ప్రస్తుతం చాలా మంది జీవితాల్లో వాట్సాప్ అనేది కీలకంగా మారిన సంగతి తెలిసిందే. చాలా మంది వాట్సాప్‌ను కమ్యూనికేషన్ సాధనంగానే కాకుండా.. దానిపై ఆధారపడే బిజినెస్‌ రన్ చేస్తున్నారు. అయితే తొలుత చాలా మంది వినియోగదారులు తమ ఇంటర్‌నెట్ సమస్యగా భావించారు. అయితే కొద్దిసేపటికే ఇది వాట్సాప్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య అని తెలుసుకున్నారు. వెంటనే ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో #WhatsAppDown అనే హ్యాష్‌ట్యాగ్‌తో యూజర్లు వాట్సాప్ యజమాన్యానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే మీమ్స్‌తో కూడా సందడి చేస్తున్నారు. 

Scroll to load tweet…

ప్రముఖ ఆన్‌లైన్ టూల్ డౌన్ డిటెక్టర్ మధ్యాహ్నం 12.07 గంటలకు అసాధారణంగా అధిక సమస్య నివేదికలను గుర్తించడం ప్రారంభించింది. మధ్యాహ్నం 1 గంటలోపు అలాంటి వేలాది నివేదికలు రిపోర్ట్ చేయబడ్డాయి. ఇటలీ, టర్కీకి చెందిన సోషల్ మీడియా వినియోగదారులు కూడా సందేశాలు పంపలేకపోతున్నారని పోస్ట్‌లు చేస్తున్నారు.