మెటా సారథ్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ సెప్టెంబరులో దేశంలోని 26.85 లక్షల ఖాతాలపై నిషేధం విధించింది. ఆగస్టులో నిషేధించిన 23.28 లక్షల ఖాతాల కంటే సెప్టెంబర్‌లో బ్లాక్ చేసిన అకౌంట్ల సంఖ్య 15 శాతం ఎక్కువగా ఉంది.
మెటా సారథ్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ సెప్టెంబరులో దేశంలోని 26.85 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వీటిలో 8.72 లక్షల ఖాతాలు వినియోగదారుల నుంచి ఎలాంటి రిపోర్టులు రాకముందే వాటిని నిషేధం విధించడం గమనార్హం. మంగళవారం నాడు వాట్సాప్ తన నెలవారీ నివేదికను వెల్లడించింది. అంతకుముందు ఆగస్టులో వాట్సాప్ 23.28 లక్షల ఖాతాలపై నిషేధం విధించింది. సెప్టెంబర్‌లో నిషేధిత ఖాతాల సంఖ్య ఆగస్టుతో పోలిస్తే 15 శాతం ఎక్కువ.
వాట్సాప్ నెల వారీ నివేదిక ప్రకారం..
సెప్టెంబర్ 1, 2022 నుంచి సెప్టెంబర్ 30,2022 మధ్య 26,85,000 ఖాతాలపై WhatsApp నిషేధం విధించింది. వీటిలో 8,72,000 ఖాతాలు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే బ్లాక్ చేయబడ్డాయి. ఇంటర్నెట్‌ను సురక్షితంగా, నమ్మదగినదిగా చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్బంగా వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ.. "IT రూల్స్ 2021 ప్రకారం.. సెప్టెంబర్ 2022 నెల నివేదికను వెల్లడించాం.. ఈ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు నివేదిక, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యల వివరాలు.. అలాగే మా ప్లాట్‌ఫారమ్‌లో దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి కంపెనీ తీసుకున్న చర్యలు వివరాలను నివేదిక లో వెల్లడించాం అని తెలిపారు.
“ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సేవల దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ అగ్రగామిగా ఉంది. సంవత్సరాలుగా.. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లోని వినియోగదారులకు సురక్షితమైన సేవలందించడానికి క్రుషి చేస్తున్నాం. ఇందు కోసం...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,ఇతర టెక్నాలజీ, డేటా ఆనాలసిస్ సైంటిస్టులను మరిన్ని సేవలను ఉపయోగిస్తున్నాం..అని తెలిపారు.
అప్‌గ్రేడ్ ఐటి రూల్స్ 2021 ప్రకారం..ఐదు మిలియన్ల (50 లక్షల) కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్న ప్రధాన డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నెలవారీ సమ్మతి నివేదికను ప్రచురించాలి. ఇందుకోసం.. అక్టోబర్ 28న ప్రభుత్వం సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను నోటిఫై చేసింది. దీని కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై వినియోగదారు ఫిర్యాదులను పరిష్కరించడానికి అప్పీలేట్ ప్యానెల్‌లు ఏర్పాటు చేయబడింది. సోషల్ మీడియా వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం నియమించిన అప్పీలేట్ కమిటీని మూడు నెలల్లో ఏర్పాటు చేయనున్నారు.
ఖాతాలపై నిషేధం ఎందుకు ?
నూతన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి నెలా వాటి సమ్మతి నివేదికలను విడుదల చేయాలి. అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను కూడా పేర్కొనాలి. తాజా వాట్సాప్ నివేదిక ప్రకారం, సెప్టెంబర్‌లో కంపెనీకి 666 ఫిర్యాదులు అందాయి. అయితే కేవలం 23 పై మాత్రమే చర్యలు తీసుకోబడ్డాయి.
ఎలా రిపోర్టు చేయాలి?
ఎవరైనా మీతో అనుచితంగా ప్రవర్తించినట్లయితే..మీరు వారి ఖాతాలపై రిపోర్టు చేయవచ్చు.కొన్ని సందర్భాల్లో.. వినియోగదారులు సాక్ష్యంగా స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా..మీరు వాట్సాప్‌లో వినియోగదారుని సులభంగా బ్లాక్ చేయవచ్చు. వాట్సాఫ్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారుని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయవచ్చు. ఆ సందర్భంలో WhatsApp చాట్‌లోని చివరి ఐదు సందేశాలను అడుగుతుంది. లేదా అసభ్యకరమైన సందేశాన్ని ఎక్కువసేపు నొక్కి పట్టుకుంటే.. మూడు చుక్కలు వస్తాయి. అందులో కూడా రిపోర్టు చేయవచ్చు.
వినియోగదారు నిబంధనలు మరియు షరతులను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించినప్పుడు మాత్రమే WhatsApp ఖాతాలను నిషేధిస్తుంది. ప్రధానంగా ప్లాట్‌ఫారమ్‌లలో విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం. ఫేక్ న్యూస్ ను షేర్ చేస్తుండడపై వాట్సాప్ కఠినంగా వ్యవహరిస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఏకపక్షంగా కంటెంట్‌ని పుష్ చేయడం.. వినియోగదారులను ‘డి-ప్లాట్‌ఫార్మింగ్’ చేయడంపై కొన్ని ఆందోళనలు నెలకొన్నాయి.
