Year Ender 2023: ఈ ఏడాది ప్రపంచ దేశాలు భారత్ గురించి ఏం సెర్చ్ చేశాయి?

ఈ ఏడాది ప్రపంచ దేశాలు భారత్ గురించి ఏం తెలుసుకోవాలని తహతహలాడాయో? గూగుల్‌లో ఏ ప్రశ్నలను అడిగాయో వివరిస్తూ మైగవ్ ఇండియా ఎక్స్‌లో పోస్టులు పెట్టింది. ఇందులో ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
 

what world countries searched for india in 2023 reveals mygovindia post as year ender 2023 kms

మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరం చరిత్రలో నిలవనుంది. ప్రతి సంవత్సరంలాగే.. ఈ ఏడాది కూడా మననం చేసుకోవడానికి మంచి విషయాలతోపాటు.. చేదు విషయాలు కూడా ఉన్నాయి. ఏడాది చివరిలో  వీటిని మరోసారి నెమరేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయాలను భిన్నమైన కోణంలో పలు సంస్థల వార్షిక నివేదికలు, గూగుల్ సెర్చ్ ఆధారిత రిపోర్టులు మన ముందు ఉంచుతున్నాయి. తాజాగా, ప్రభుత్వ వెబ్ సైట్ మై గవ్ ఇండియా ఓ కీలక నివేదికను విడుదల చేసింది. అదేమిటంటే.. ఈ ఏడాదిలో ప్రపంచ దేశాలు మనం దేశం గురించి ఏం తెలుసుకోవాలని అనుకున్నాయి. ఏ విషయాలను గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశాయి?

మై గవ్ ఇండియా ఈ విషయాలను ఎక్స్ (ట్విట్టర్)వేదికగా వెల్లడించింది. విదేశీయులు మన దేశం గురించి తెలుసుకోవాలని అనుకున్న ఆసక్తికర ప్రశ్నల జాబితా ఇలా ఉన్నది.

1. గ్లోబల్ సౌత్‌కు భారత ఎలా సారథ్యం వహిస్తున్నది?
2. ఆఫ్రికా యూనియన్‌కు జీ20 సభ్యత్వాన్ని భారత్ ఎలా సాకారం చేయగలిగింది?
3. చంద్రుడి దక్షిణ ధ్రువం మీదికి చేరుకున్న తొలి దేశం భారతేనా?
4. ప్రపంచంలో అత్యంత ఆదరణ గల నేతగా ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ అయ్యారు? 
5. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సూట్(SUIT- Solar Ultraviolet Imgaing Telescope) ద్వారా సూర్యుడిని పిక్చర్ తీయగలిగింది?
6. భారత్‌లో ఎలా బిజినెస్ ప్రారంభించాలి?
7. యూరప్ నుంచి కశ్మీర్‌కు ట్రిప్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
8. భారత్‌లో తయారైన వస్తువులను విదేశాల్లో ఎక్కడ కొనాలి?
9. భారత్ తరహాలోనే ఇతర దేశాల్లోనూ యూపీఐ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

Also Read: MS Dhoni: సచిన్ తర్వాత మళ్లీ ధోనీకే ఆ గౌరవం.. ఐకానిక్ జెర్సీ 7 మాహీకే అంకితం.. ఇక కనిపించదంతే!

ఈ తొమ్మిది ప్రశ్నలతో పాటు మరో ప్రశ్నను మై గవ్ ఇండియా నెటిజన్లకు వేసింది. ఈ ఏడాది ఇండియా గురించి మీరేం శోధించారు? అని చివరగా ప్రశ్న వేసింది. ఇప్పుడు ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios