Asianet News TeluguAsianet News Telugu

S Gurumurthy: శ్వేతపత్రం వర్సెస్ దిష్టి చుక్క.. కేంద్రం ఏం చెప్పింది? కాంగ్రెస్ ఏం చెప్పింది?

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. మోడీ హయాంలో పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పరుగు అందుకోవడానికి తీసుకున్న నిర్ణయాలను ఇందులో పేర్కొన్నారు. అంతకు ముందటి కాంగ్రెస్ దశాబ్ద కాలంలో ఆర్థిక వ్యవస్థ తీరును వివరించారు. ఈ శ్వేతపత్రానికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ పేపర్‌ను తెచ్చింది.
 

what white paper and black paper discussing s gurumurthys take here kms
Author
First Published Feb 19, 2024, 7:44 PM IST

PM Modi: మోడీ ప్రభుత్వం ఇటీవలే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. పదేళ్ల బీజేపీ పాలనను అంతకుముందటి పదేళ్ల కాంగ్రెస్ పాలనతో పోల్చుతూ ఈ వైట్ పేపర్‌ను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో అస్థిరంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలనూ ఇందులో పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలను అందించి ప్రపంచ యవనిక మీద దేశ కీర్తిని పెంచడానికి తీసుకున్న నిర్ణయాలనూ ఏకరువు పెట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరత్వానికి, వృద్ధికి, ఇతర అంశాల్లో మెరుగైన ప్రదర్శనకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ఈ పత్రంలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ పేపర్ విడుదల చేసింది. అయితే.. శ్వేతపత్రంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ముఖ్య మైన విషయాలపై ఖండనలు.. లేదా తిరస్కారాలు ఈ బ్లాక్ పేపర్‌లో కాంగ్రెస్ పేర్కొనకపోవడం గమనార్హం. అంతేకాదు, 2014లో ఆర్థిక గందరగోళాన్నీ కాంగ్రెస్ ఖండించలేదు. కానీ, నేరుగా మోడీపై పాలనపై తీవ్ర ఆరోపణలు చేయడంపైనే శ్రద్ధ పెట్టింది. సరైన ఆధారాలు, వ్యూహాలు లేకుండా ఆరోపణలు చేసి వదిలింది.

శ్వేతపత్రంలో మూడు ముఖ్యమైన విషయాలను కేంద్రం స్పష్టంగా పేర్కొంది.  వాటిపై కాంగ్రెస్ బ్లాక్ పేపర్ కామెంట్ చేయలేదు. మొట్టమొదటిది, 2004-05లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందటి వాజ్‌పేయి ప్రభుత్వం ఇచ్చిన సుభిక్షమైన ఆర్థిక వ్యవస్థను పొగుడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇప్పుడు మోడీ ప్రభుత్వం విజయాలను పేర్కొంది.

ఇక రెండోది, పదేళ్ల కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ పాలనలో అస్థిరతను ప్రధానంగా పేర్కొంది. తప్పుడు విధానాలు, తీవ్ర అవినీతి వలన భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించారు. మూడోది, మోడీ అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు.. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులను ప్రధానం చేశారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ విజయవంతంగా మన దేశాన్ని ఐదో బలమైన ఆర్థిక వ్యవస్థగా మలిచిన తీరును వివరించారు. తద్వార వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రపంచం ముందు మన దేశాన్ని నిలిపారు.

మన దేశ ఆర్థిక పురోగతిని చూసి అంతర్జాతీయ ద్రవ్య నిధి సైతం కితాబిచ్చింది. భారత ప్రస్తుత కటిక చీకటిలో ఒక ధ్రువతారగా నిలుస్తున్నదని పేర్కొంది. పలుమార్లు మన దేశ వృద్ధిని హర్షించింది. ఎస్ అండ్ పీ వంటి మరికొన్ని సూచీలు కూడా ప్రభుత్వ పనితీరును ప్రశంసించాయి.

2014కు ముందు చూసుకుంటే కఠినమైన వాస్తవాలు ఉన్నాయి.  మోడీ ప్రభుత్వ నిర్ణయాలతో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. స్తంభించిన ఆర్థికవ్యవస్థ, దుబారా ఖర్చులు, అసంగతంగా బడ్జెట్ కేటాయింపులు, చుక్కలను తాకిన ద్రవ్యోల్బణం వంటి అంశాలతో ఆర్థిక వ్యవస్థ కఠిన సవాళ్లను ఎదుర్కొంది. వీటికితోడు పెద్ద పెద్ద స్కామ్‌లు, దివాళాలు, పెరిగిన ఎన్‌పీఏలలతో బ్యాంకులు ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ముఖ్యమైన రుణాల మంజూరు చేయడం క్లిష్టంగా మారింది.

అయితే.. వీటిని బ్లాక్ పేపర్‌లో కాంగ్రెస్ ఖండించలేదు. వీటిని హేతుబద్ధంగా చర్చకు పెట్టకుండా.. ఆధారాలతో తిప్పికొట్టకుండా గుడ్డిగా మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది.

గణాంకాలు

వేర్వేరు ప్రభుత్వ హయాంలలో భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను శ్వేతపత్రం ముందుంచింది. వాజ్‌పేయి హయాంలో 2003-04 కాలంలో ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉండగా.. ఆ తర్వాత 2013 కల్లా ఇది 12.3 శాతానికి పెరిగింది.

2009-14 మధ్య కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణం గరిష్టానికి చేరింది. 10.4 శాతానికి పెరిగింది. అదే మోడీ హయాంలో ఇది 5.5 శాతానికి కట్టడి చేయగలిగారు. 1991-96 కాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అదే 1998-2004 కాలంలో బీజేపీ హయాంలో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టు నిర్వహించారు. ఇది అంతర్జాతీయంగా మన దేశ ఆర్థిక వ్యవస్థం, వాణిజ్యంపై ఆంక్షలను తెచ్చింది. 2004-14 కాలంలో 2008నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమస్యను ఎదుర్కొన్నారు. ఇక మోడీ హయాంలో కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయగలిగారు. నిరుద్యోగ రేటు 6.1 శాతం(2017-18లో) నుంచి 2022-23లో 3.2కు తగ్గించగలిగారు.

దిష్టి చుక్క - మోడీ

ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అందరికీ అందుబాటులోకి రాగా.. అనూహ్యంగా కాంగ్రెస్ తెచ్చిన బ్లాక్ పేపర్ అందుబాటులో పెట్టలేదు. మీడియాకు కూడా అందుబాటులోకి రాలేదు. అయితే.. ది వైర్ అనే వెబ్ న్యూస్ పోర్టల్ మాత్రం రిపోర్ట్ చేసింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగిత పెరగడం, సాగు వెనుకబడటం, మహిళలపై అఘాయిత్యాలు పెరగడం వంటి అంశాలను కాంగ్రెస్ ఆ బ్లాక్ పేపర్‌లో ప్రస్తావించినట్టు రాసింది. ఇది కేవలం మోడీపై విమర్శలు సంధించాలనే కాంక్షతో బ్లాక్ పేపర్‌ను తెచ్చినట్టుగానే ఉన్నది. ఈ బ్లాక్ పేపర్‌ను మోడీ ఈ విధంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి ఈ బ్లాక్ పేపర్ ఒక దిష్టి చుక్కలా ఉంటుందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios