Asianet News Telugu

కార్గిల్ యుద్ధంలో నచికేత, ఇప్పుడు అభినందన్: అభినందన్ ను కాపాడే అంశాలు ఇవే.....

యుద్ధం జరుగుతున్న సమయంలో నచికేత విమానం కూలిపోవడంతో ఆయన పాకిస్థాన్ సరిహద్దులో కుప్పకూలిపోయారు. అయితే అతడిని పాకిస్థాన్ ఆర్మీ తన కస్టడీలోకి తీసుకుంది. తాను పాకిస్థాన్ భూ భాగంలో ఉన్నానని గ్రహించిన నచికేత తన దగ్గర ఉన్న కీలక ఆధారాలను తగులబెట్టేశాడు. 

what saying  Geneva Conventions invoked to bring our IAF pilot abhinandan back
Author
Delhi, First Published Feb 28, 2019, 8:22 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఢిల్లీ: యావత్ భారతదేశం అంతా తలచుకుంటున్న పేరు అభినందన్. పాకిస్థాన్ ఆర్మీ కస్టడీలో ఉన్న వైమానిక దళ వింగ్ కమాండర్ పాకిస్థాన్ చెర నుంచి ఎలా బయటపడతారా అంటూ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

అభినందన్ సురక్షితంగా దేశానికి తిరిగి రావాలని కుల, మతాలకు అతీతంగా ప్రతీ భారతీయుడు ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. పాకిస్థాన్ ఆర్మీకి చేజిక్కిన అభినందన్ విడుదల కోసం ప్రభుత్వాలు కృషి చెయ్యాలంటూ భారతదేశ ప్రజలు కోరుతున్నారు. 

ఈ నేపథ్యంలో యుద్ధ ఖైదీలకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అధ్యయనం ప్రారంభించింది కేంద్రం. యుద్ధ ఖైదీల విడుదలలో జెనీవా ఒప్పందాలు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ, యుద్ధఖైదీ పట్టుబడినప్పుడు కానీ జెనీవా ఒప్పందాల ప్రకారం వారి విడుదలకు ఆస్కారం ఉంటుంది. 

అయితే ప్రస్తుతం పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చెయ్యడం లేదు. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ యుద్ధంలో పట్టుబడిన ఖైదీ కూడా కాదు. అయినా జెనీవా ఒప్పందాలే అతడి విడుదలకు దిశానిర్దేశం చెయ్యనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఒప్పందం ప్రకారం అనేక మంది యుద్ధఖైదీలు విడుదలైన దాఖలాలు లేకపోలేదు. అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి చిక్కడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అంశం జెనీవా ఒప్పందం. 

అసలు జెనీవా ఒప్పందం అంటే ఏంటి... అభినందన్ ను కాపాడే ప్రయత్నంలో జెనీవా ఒప్పందాల పాత్ర ఎలా ఉండబోతుంది. ప్రస్తుత పరిస్థితులపై జెనీవా ఒప్పందం ఏం చెయ్యాలని చెబుతుందో ఒ సారి చూద్దాం.  

ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకదేశానికి చెందిన ప్రజలు, సైనికులు వేరే దేశానికి పట్టుబడితే వారిని యుద్ధఖైదీలుగా పిలుస్తారు. యుద్ధంలో గాయపడి లేదా క్షతగాత్రులై పట్టుబడితే వారికి ఎటువంటి రక్షణ కల్పించాలి? వీరికి ఎలాంటి హక్కులు ఉంటాయన్నది ఒప్పందాల్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1949 కుదిరిన ఈ ఒప్పందాలపై సుమారు 196 దేశాలు సంతకాలు చేశాయి. తర్వాతి కాలంలో ఈ ఒప్పందాలను మూడు సార్లు సవరించారు. అయితే రెండు దేశాల మధ్య యుద్దం జరుగుతున్నప్పుడు ఏర్పడిన పరిణామాలపై ఈ ఒప్పందాలు ఏం చెప్తున్నాయో ఓసారి చూద్దాం. 

జాతి, మత, లింగ, ప్రాంత వివక్షలకు చోటు లేకుండా యుద్ధంలో గాయపడిన సైనికులు ఎవరైనా సరే, వారికి మానవతా దృక్పథంతో సాయం అందించాలన్నదే ఒడంబడికలో ప్రథమ ఒప్పందం. గాయాలపాలైన లేదా నిలకడగా లేని సైనికులకు రక్షణ కల్పించడమే ఈ ఒడంబడిక ముఖ్య ఉద్దేశం. 

పట్టుబడ్డ సైనికులు లేదా పౌరుల పట్ల మానవత్వంతో స్పందిస్తూ వారిని హింసించటం, దాడులు చేయటం వంటివేమీ చెయ్యకూడదన్నది లక్ష్యం. సరైన న్యాయ విచారణ, తీర్పు లేకుండా వారికి మరణదండనతో సహా ఎలాంటి శిక్షలూ విధించకూడదు. పైగా వారికి సంపూర్ణ వైద్య సహాయం, చికిత్స అందిస్తూ రక్షణగా నిలబడాలని మెుదటి ఒడంబడిక స్పష్టం చేస్తోంది. 

ఇకపోతే సముద్రాల్లో గాయాలపాలై పట్టుబడిన నౌకాదళ సైనికులకు సంబంధించింది. నౌకాదళ సైనికులు తీవ్ర గాయాలపాలై శత్రుదేశానికి పట్టుబడితే వారికి ఓడల్లోనే వైద్య సహాయం అందించడంతోపాటు ఆస్పత్రి ఓడలకు తరలించాలన్నదే ఈ ఒప్పందం యెుక్క ముఖ్య ఉద్దేశం. 

మరోవైపు యుద్ధ ఖైదీల గురించి పూర్తిగా స్పష్టం చేసేది ఒప్పందం 3. యుద్ధ ఖైదీలు అంటే ఎవరు అన్నదానిపై క్లారిటీ ఇచ్చిన ఒప్పందం ఇది. యుద్ధఖైదీలను బందీలుగా తీసుకున్న దేశం వారి నుంచి కేవలం వారి పేరు, సైన్యంలో వారి ర్రయాంకు, నంబర్ మాత్రమే తెలుసుకోవాలని స్పష్టంగా ఒప్పందంలో పేర్కొంది. అంతేకానీ శత్రు దేశానికి సంబంధించిన సమాచారాం రాబట్టేందుకు వారిని హింసించడం, శారీరకంగా మానసికంగా చిత్ర హింసలకు గురిచెయ్యడం తగదని స్పష్టంగా నిర్దేశించింది. 

ఇక ఆఖరిది నాలుగో ఒప్పందం. యుద్ధంలో పట్టుబడిన పౌరులకు సంబంధించిన ఒప్పందంగా దీన్ని చెప్పుకుంటారు. యుద్ధంలో పట్టుబడిన పౌరులకు కూడా సైనికుల మాదిరిగానే అన్ని రక్షణలు కల్పించాలన్నదే ఈ ఒప్పందం యెుక్క ముఖ్య ఉద్దేశం. పట్టుబడిన పౌరులకు సంబంధించి వారికి అవసరమైన సపర్యలు అందించాలని స్పష్టం చేస్తోంది. 

ఈ ఒప్పందాల ప్రకారమే అభినందన్ ను సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో అంటే 1999 కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నచికేత పాకిస్థాన్ కు చిక్కారు. 

యుద్ధం జరుగుతున్న సమయంలో నచికేత విమానం కూలిపోవడంతో ఆయన పాకిస్థాన్ సరిహద్దులో కుప్పకూలిపోయారు. అయితే అతడిని పాకిస్థాన్ ఆర్మీ తన కస్టడీలోకి తీసుకుంది. తాను పాకిస్థాన్ భూ భాగంలో ఉన్నానని గ్రహించిన నచికేత తన దగ్గర ఉన్న కీలక ఆధారాలను తగులబెట్టేశాడు. 

అయితే యుద్ధానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని భారత్ ప్లాన్ ఏంటో తెలపాలంటూ నచికేత్ ను చిత్ర హింసలకు గురి చేసింది పాకిస్థాన్. పాకిస్థాన్ యుద్ధఖైదీగా కస్టడీలోకి తీసుకున్న నచికేతను చిత్రహింసలకు గురి చేశారు. 

జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధఖైదీలుగా దొరికితే ఏడు రోజుల్లోగా అతడిని విడుదల చెయ్యాలి. అందులో భాగంగా ఆనాడు కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత నచికేతను విడుదల చేసింది పాకిస్థాన్. కార్గిల్ యుద్ధంలో నికేతను విడుదలకు వ్యవహరించిన దౌత్య నీతినే అభినందన్ విషయంలోనూ ప్రయోగించాలని భారత్ ప్రయత్నిస్తోంది. 


  

Follow Us:
Download App:
  • android
  • ios