గత కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా టెన్షన్ కొంతవరకు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చైనా, దక్షిణ కొరియా సహా అనేక ఆసియా, యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు పెరగడం మరోసారి ఆందోళనలకు కారణం అవుతుంది.
కరోనా వైరస్ (Coronavirus) ఎప్పుడు, ఏ రూపంలో విరుచుకుపడుతుందో చెప్పలేని పరిస్థితి. గత కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా టెన్షన్ కొంతవరకు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చైనా, దక్షిణ కొరియా సహా అనేక ఆసియా, యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు పెరగడం మరోసారి ఆందోళనలకు కారణం అవుతుంది. ఈ ప్రభావం భారత్‌పైన కూడా ప్రభావం ఉందని.. నాలుగో వేవ్‌కు ఇది కారణం కావచ్చనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులకు స్టెల్త్ ఒమిక్రాన్ (రహస్య ఒమిక్రాన్) అనే కొత్త వేరియంట్ కారణంగా చెబుతున్నారు. గతేడాది వెలుగుచూసిన అత్యంత వేగంగా వ్యాపించే సామర్థం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ యొక్క ఉప వేరియంట్‌గా దీనిని పరిగణిస్తున్నారు.
భారత్‌తో కోవిడ్ థర్డ్ వేవ్‌కు ఒమిక్రాన్ వేరియంట్ అధిక ప్రసరణ కూడా ఒక కారణం. ఆ వేరియంట్ యొక్క ఉప వేరియంటే stealth Omicron. ఇది శాస్త్రీయంగా BA.2 Omicron వేరియంట్‌గా సూచించబడింది. డెన్మార్క్‌లోని Statens Serum Institute ప్రాథమిక అంచనాల ప్రకారం.. స్టెల్త్ వేరియంట్ ఇంతకుముందు ఉన్న కోవిడ్ వేరియంట్‌ల కన్నా 1.5 రేట్ల ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతుంది.
గుర్తించడం కష్టం..
స్టెల్త్ వేరియంట్‌ను అన్ని పరీక్షల్లో తేలికగా గుర్తించడం సాధ్యపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లోని కీలక ఉత్పరివర్తనాలను కోల్పోతుందని వారు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడానికి వేగవంతమైన PCR పరీక్షలకు అవసరమని తెలిపారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కంటే Stealth Omicron తీవ్రత కలిగి ఉంటుందా..? లేదా..? అనే అంశాలను నిర్దారించడానికి ప్రస్తుతానికి సరిపడ డేటా లేదని నిపుణులు చెప్పారు. మరోవైపు డబ్ల్యూహెచ్‌వో మాత్రం కరోనా ఇప్పుడే అంతం కాలేదని.. మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకురావొచ్చని హెచ్చరించింది. నిరక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపింది.
ఎగువ శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తుంది..
WHO ప్రకారం.. స్టెల్త్ ఓమిక్రాన్ వేరియంట్ ప్రాథమికంగా ఎగువ శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ.. డెల్టా వేరియంట్ మాదిరిగా.. BA.2 వేరియంట్ ఊపిరితిత్తులను ప్రభావితం చేయదు. అందుకే ఈ వేరియంట్స్ సోకినవారిలో శ్వాసలోపం గానీ, వాసన, రుచి కోల్పోవడం కానీ జరగకపోవచ్చు.
భారత్ అప్రమత్తం..
ఇక, భారత్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. ప్రస్తుతం కూడా ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్, COVID-19 ప్రవర్తన’ అనే ఐదు దశల వ్యూహానికి కట్టుబడి ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను శుక్రవారం కోరింది. ఆగ్నేయాసియా, యూరప్‌లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్ర కార్యదర్శులకు రాసిన లేఖలో తెలిపారు.
‘‘ఆగ్నేయాసియా, యూరప్‌లోని కొన్ని దేశాల్లో కోవిడ్-19 కేసుల్లో పునరుజ్జీవనాన్ని గమనించిన నేపథ్యంలో 2022 మార్చి 16వ తేదీన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. స్థిరమైన జీనోమ్ సీక్వెన్సింగ్, నిఘాను తీవ్రతరం చేయాలని సూచించారు’’ అని భూషణ్ తన లేఖలో పేర్కొన్నారు.
