Asianet News TeluguAsianet News Telugu

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటీ? సోనియా, రాహుల్‌కు సంబంధం ఏమిటీ?

ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసుపై చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలోనే అసలు నేషనల్ హెరాల్డ్ ఏమిటీ? ఈ కేసు దేనికి సంబంధించింది? అందులోనూ ఈ కేసుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సంబంధమేంటీ? అనే విషయాలను చూచాయగా పరిశీలిద్దాం.

what is national herald case? what is the involvement of sonia gandhi, rahul gandhi
Author
New Delhi, First Published Jun 13, 2022, 1:12 PM IST

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆమెకు కొడుకు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు పంపడంతో మరోసారి నేషనల్ హెరాల్డ్ కేసు చర్చలోకి వచ్చింది. ఈ రోజు రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. దేశవ్యాప్తంగా సుమారు 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ బయల్దేరగా.. ఆయన వెంట ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు వచ్చారు. కార్యాలయం వరకు మార్చ్ చేశారు. రెండు బారికేడ్లు దాటేసినా.. మూడో బారికేడ్ వద్ద పోలీసులు బలగాలు భారీగా ఉండటంతో నిరసనకారులు, ప్రియాంక గాంధీ మరికొందరు నేతలు అక్కడే నిలిచిపోయారు. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఇంతకీ నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి? ఆ కేసుకు కాంగ్రెస్‌కు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఏమిటి సంబంధం?

నేషనల్ హెరాల్డ్ ఏమిటీ?

నేషనల్ హెరాల్డ్ అనేది ఒక న్యూస్ పేపర్. దీన్ని దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించారు. పలువురు ఫ్రీడమ్ ఫైటర్లు కలిసి 1937లో స్థాపించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఈ పత్రికను పబ్లిష్ చేసింది. ఏజేఎల్‌లో అప్పుడు సుమారు 5000 మంది ఫ్రీడమ్ ఫైటర్లు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ అప్పటికే కౌమీ ఆవాజ్ అనే ఉర్దూ దిన పత్రిక, నవజీవన్ అనే హిందీ దినపత్రికలను ప్రచురిస్తున్నది.

అప్పటి మేధావులు, ప్రభావవంతులు ఫోకస్ పెట్టడంతో నేషనల్ హెరాల్డ్ పేపర్ ఒక జాతీయవాద పత్రికగా పేరొందింది. అనతి కాలంలో పేరు సంపాదించింది. ఇందులో ముఖ్యంగా నెహ్రూ.. బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ ఘాటైన పదాలతో వ్యాసాలు రాసేవారు. దీంతో పత్రికను 1942లో బ్రిటీష్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. మళ్లీ మూడేళ్లకు రీఓపెన్ చేశారు. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత నెహ్రూ ఈ పత్రిక బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ పత్రిక భావజాలాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది.

కానీ, ఆర్థిక కారణాలతో 2008లో ఈ న్యూస్ పేపర్ సేవలు నిలిచిపోయాయి. కానీ, 2016 నుంచి డిజిటల్ పబ్లికేషన్ ప్రారంభమైంది.

నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటీ?

రూ. 2000 కోట్ల విలువలైన అసెట్స్‌ ఈక్విటీ ట్రాన్సాక్షన్‌లో అవకతవకలకు సంబంధించినదే ఈ కేసు. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ పలుదఫాలుగా సొమ్ము అందించింది. సుమారు రూ. 90 కోట్లు అందించినా 2008లో ఈ పత్రిక మూతపడక తప్పలేదు.

అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్థాపితమైంది. ఈ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ 2010లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను టేకోవర్ చేసుకుంది. అనంతరం బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ వ్యవహారంపై ఆరోపణలు సంధించారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ మోసపూరితంగా అధీనం చేసుకుందని కంప్లైంట్ చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, పొలిటికల్ సంస్థ థర్డ్ పార్టీతో ఆర్థిక లావాదేవీలు జరపరాదు.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కువ మొత్తంలో లాభంతోనే సొంతం చేసుకున్నారని స్వామి ఆరోపించారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ. 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను రికవరీ చేసుకునే హక్కును పొందింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కాంగ్రెస్‌కు బాకీపడ్డ సుమారు రూ. 89.5 కోట్లు రద్దు అయినట్టు స్వామి ఆరోపించారు. తద్వార ఆ సొమ్ము అంతా వీరు పొందారని (మనీలాండరింగ్?) సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేశారు.

2016 నుంచి ఈడీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌, పలువురు కాంగ్రెస్ లీడర్లను ఇన్వెస్టిగేట్ చేస్తున్నది. 

యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కేవలం చారిటీ కోసం స్థాపించిన ఎన్జీవో సంస్థ అని కాంగ్రెస్ వాదిస్తున్నది. ఈ ట్రాన్సాక్షన్స్ కమర్షియల్ అని, ఫైనాన్షియల్ కాదని పేర్కొంటున్నది. అసలు ఆస్తులు లేదా నగదు అనేది బదిలీనే కాలేదుని, అలాంటప్పడు మనీలాండరింగ్ కేసు ఎలా అవుతుందని అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios