Asianet News TeluguAsianet News Telugu

gold medalist : గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు అస్వస్థత..

నీరజ్ చోప్రాకు తాజాగా కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని తేలింది. నీరజ్ సాధించిన బంగారు పతకాన్ని మందిరంలో ఉంచి పూజలు చేస్తామని నీరజ్ తల్లి సరోజ్ దేవి చెప్పారు. తీవ్ర జ్వరం కారణంగా గురు, శుక్రవారాల్లో పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సిన సన్మాన కార్యక్రమాలను వాయిదా వేశారు.

What is hospitalized Neeraj Chopra s COVID-19 status
Author
Hyderabad, First Published Aug 19, 2021, 10:17 AM IST

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తీవ్ర జ్వరం కారణంగా తన గ్రామానికి సమీపంలో ఉన్న పానిపట్ నగరంలోని ఆస్పత్రిలో చేరారు. పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సన్మానానికి వచ్చిన చోప్రా అలసటతోపాటు తీవ్ర జ్వరంతో బాధపడుతూ వేదికను వదిలి వెళ్లి ఆస్పత్రిలో చేరారు. 

నీరజ్ చోప్రాకు తాజాగా కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని తేలింది. నీరజ్ సాధించిన బంగారు పతకాన్ని మందిరంలో ఉంచి పూజలు చేస్తామని నీరజ్ తల్లి సరోజ్ దేవి చెప్పారు. తీవ్ర జ్వరం కారణంగా గురు, శుక్రవారాల్లో పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సిన సన్మాన కార్యక్రమాలను వాయిదా వేశారు.

నీరజ్ టోక్యో నుంచి తిరిగి స్వదేశానికి వచ్చాక ఒలింపిక్ బృందం కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హోస్ట్ చేసిన హై టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న నీరజ్ చోప్రా అస్వస్థతకు గురై అస్పత్రిలో చేరారు. కరోనా నెగిటివ్ అని పరీక్షల్లో తేలడంతో జ్వరానికి చికిత్స పొందుతున్నారు.

కాగా, ఒలంపిక్స్ లో భారత్ స్వర్ణం కల నెరవేరింది. దాదాపు 100ఏళ్లకు పైగా స్వర్ణం కోసం ఎదురు చూస్తుండగా... నీరజ్ చోప్రా రూపంలో అది నిజమైంది. టోక్యో ఒలంపిక్స్ లో ఇటీవల జావెలన్ స్టార్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. కాగా తొలి గోల్డ్ మెడ‌ల్ సాధించి పెట్టిన జావెలిన్ స్టార్ నీర‌జ్ చోప్రా ( Neeraj Chopra ) తాజా వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరాడు. 

అత‌డు ఏకంగా 14 స్థానాలు ఎగ‌బాక‌డం విశేషం. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు అత‌డు 16వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మెగా ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించ‌డం నీర‌జ్ కెరీర్‌నే మార్చేసింది. ఫైన‌ల్లో 87.58 మీట‌ర్ల దూరం జావెలిన్ విసిరి ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌నంత దూరంలో నిలిచాడు.

ప్ర‌స్తుత ర్యాంకింగ్స్‌లో నీర‌జ్ 1315 పాయింట్ల‌తో జ‌ర్మ‌నీ స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ జోహ‌నెస్ వెట‌ర్ త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. వెట‌ర్ 1396 పాయింట్ల‌తో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఏడుసార్లు 90 మీట‌ర్ల కంటే ఎక్కువ దూరం విసిరిన వెట‌ర్‌.. ఒలింపిక్స్ ఫైన‌ల్లో మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు... 

Follow Us:
Download App:
  • android
  • ios