న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 75 జిల్లాలో లాక్‌డౌన్ ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కూడ ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనాను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయం తీసుకొన్నాయి. అయితే లాక్ డౌన్ అంటే ఏమిటి.. అనే చర్చ సాగుతోంది.

ఇండియాలో కరోనా రెండో దశలో ఉంది. ఈ దశలో ఒకరి నుండి మరోకరికి వ్యాపించే దశ. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ అంటే ఒక ప్రాంతం లేదా తమకు నిర్ధేశించిన భవనం లేదా గది నుండి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడమే.

అధికార యంత్రాంగం దీన్ని అత్యవసర నిర్వహణ నియమంగా భావిస్తోంది. ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వాలు లేదా పాలకులు ఈ ప్రోటోకాల్ (లాక్ డౌన్) ను ఉపయోగిస్తారు.

కరోనా కారణంగా ప్రజలు ఎవరూ కూడ బయట తిరగకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. బయట నుండి ఏదైనా ప్రమాదం వచ్చిన సమయంలో లాక్ డౌన్ ను ప్రయోగిస్తారు.

ఏదైనా ప్రమాదం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రివెంటివ్ లాక్ డౌన్ విధిస్తారు. ఇక రెండోది ఎమర్జెన్సీ లాక్ డౌన్ ప్రయోగిస్తారు. అసాధారణ పరిస్థితుల్లోనే ప్రభుత్వాలు లాక్ డౌన్  అస్త్రాన్ని ప్రయోగిస్తాయి.అయితే ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు గాను ప్రవెంటివ్ లాక్ డౌన్ విధిస్తారు.