Asianet News TeluguAsianet News Telugu

డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు : రెజ్లింగ్ ను వదిలిపెడుతున్నా... కన్నీటిపర్యంతమైన సాక్షి మాలిక్...

డబ్ల్యూఎఫ్‌ఐకి గురువారం జరిగిన ఎన్నికలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. న్యాయం జరగలేదంటూ మహిళా రెజర్లు కన్నీటిపర్యంతం అయ్యారు. సాక్షి మాలిక్ తాను రెజ్లింగ్ వదిలేస్తున్నట్లు తెలిపారు. 

WFI : I Quiet Wrestling... Says Sakshi Malik, wrestlers breaks down on camera - bsb
Author
First Published Dec 22, 2023, 12:27 PM IST

న్యూఢిల్లీ : డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ పోస్టుకు గురువారం జరిగిన ఎన్నికల్లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహాయకుడు ఎన్నికయ్యాడు. ఇది జరిగిన కాసేపటికే ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ తాను రెజ్లింగ్ ను విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. మరో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ కన్నీటి పర్యంతం అయ్యారు. 

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నిరసనల్లో ముందంజలో ఉన్న రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ మీడియాతో మాట్లాడారు. "ఇప్పుడు సంజయ్ సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికయ్యారు. మహిళా రెజ్లర్లు వేధింపులను ఎదుర్కొంటూనే ఉంటారు" అని ఫోగట్ చెప్పగా, మలిక్ తాను క్రీడ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.

12 ఏళ్ల పాటు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా ఉన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఇప్పుడు ఎన్నికైన సంజయ్ సింగ్ దీర్ఘకాల సహాయకుడు. ఉత్తరప్రదేశ్ నుండి ఆరుసార్లు బిజెపి ఎంపిగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధిస్తున్నారని సాక్షి మలిక్‌, వినేష్ పోగట్ తో సహా అగ్రశ్రేణి రెజ్లర్‌లు ఆరోపించారు. దీనిమీద తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. దీంతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

Parliament Session:‘క్రిమినల్‌’ బిల్లులకు రాజ్యసభ ఆమోదం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఆ తరువాత గురువారం జరిగిన ఎన్నికల్లో 47ఓట్లకు గాను సంజయ్ సింగ్ 40 ఓట్లు సాధించారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవికి నిరసన తెలిపిన రెజ్లర్ల ఎంపిక కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత అనితా షియోరాన్‌కు కేవలం ఏడు ఓట్లు వచ్చాయి. దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు, సాక్షి మలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఫలితాలపై తమ నిరాశను వ్యక్తం చేశారు.

మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా కామన్వెల్త్  ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ ఫోగట్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. "ఇప్పుడు సంజయ్ సింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా ఎన్నికయ్యారు, మహిళా రెజ్లర్లు మళ్లీ వేధింపులను ఎదుర్కొంటారు" అన్నారు. "దేశంలో న్యాయం ఎలా కనుగొనాలో తమకు తెలియడంలేదు’’ వాపోయారు. "మా రెజ్లింగ్ కెరీర్ భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఎక్కడికి వెళ్లాలో మాకు తెలియదు" అని అన్నారామె.

ఒలంపిక్ కాంస్య పతక విజేత పునియా మాట్లాడుతూ "ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం దురదృష్టకరం" అని అన్నారు. మాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, రాజకీయాల కోసం ఇక్కడికి రాలేదని, సత్యం కోసం పోరాడుతున్నామని, కానీ నేడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సహాయకుడు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడయ్యారని ఆయన అన్నారు.

రెజ్లింగ్ బాడీకి మహిళా చీఫ్ కావాలని తాము కోరుకున్నామని సాక్షి మలిక్ చెప్పారు. "కానీ అలా జరగలేదు," ఆమె చెప్పింది. "మేము పోరాడాం, కానీ కొత్త అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సహాయకుడు, అతని వ్యాపార భాగస్వామి అయితే, నేను రెజ్లింగ్‌ను విడిచిపెడుతున్నాను" అని ఒలింపిక్ కాంస్య పతక విజేత తన బూట్లను టేబుల్‌పై ఉంచి చెప్పింది.

ఈ ఏడాది జనవరిలో, ముగ్గురు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు నాయకత్వం వహించారు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పలువురు రెజ్లర్ లను  లైంగికంగా వేధించారని, అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో వారు నిరసనను విరమించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సహాయకుడు లేదా బంధువు ఎవరూ రెజ్లింగ్ సంస్థ తదుపరి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడరని కూడా రెజ్లర్లకు హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ కుమారుడు ప్రతీక్, అల్లుడు విశాల్ సింగ్ ఎన్నికల పోటీలో పాల్గొనలేదు. అతని సహాయకుడు సంజయ్ సింగ్ నామినేషన్ క్లియర్ చేశారు.

సంజయ్ సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అతను డబ్ల్యూఎఫ్ఐ చివరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో పనిచేశాడు. 2019 నుండి దాని జాయింట్ సెక్రటరీగా ఉన్నాడు. ఈరోజు ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఇది అబద్ధాలపై సత్యం సాధించిన విజయమని అన్నారు. "ఆ లక్షణాలకు స్థానం లేని వ్యక్తిపై వారు ఇటువంటి ఆరోపణలు చేశారు" అని ఆయన అన్నారు. అతను బిజెపి ఎంపికి సన్నిహితుడా అనే ప్రశ్నకు సంజయ్ సింగ్, "అఫ్ కోర్స్, నేను అతనితో సన్నిహితంగా ఉన్నాను." ఫెడరేషన్ ఇప్పుడు ఎలా పనిచేస్తుందనే దానిపై రెజ్లర్లలో కొంతమంది ఆందోళన చెందుతున్న విషయాన్ని అడిగితే.. "ఏ మహిళా రెజ్లర్‌కు అన్యాయం జరగదు" అని అన్నారు.

సంజయ్ సింగ్ విజయంపై, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ, "నేను దేశంలోని రెజ్లర్లకు, డబ్ల్యూఎఫ్ఐ కార్యదర్శికి విజయాన్ని అందించాలనుకుంటున్నాను. కొత్త ఫెడరేషన్ ఏర్పడిన తర్వాత, రెజ్లింగ్ ఈవెంట్‌లు తిరిగి ప్రారంభమవుతాయని నేను ఆశిస్తున్నాను" డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ జూలైలో ప్రారంభమైంది, అయితే కోర్టు కేసులతో ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ డబ్ల్యూఎఫ్ఐ ని సస్పెండ్ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది, ఎన్నికలకు డెక్ క్లియర్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios