West Bengal: టిటాగర్ బండ్ల కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తూ.. తన పార్టీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ.. దానికి అనుకూలంగా ప్రచారం సాగిస్తున్న ఓ వర్గం మీడియాపై ఆమె విమర్శలు గుప్పించారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం నాడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై తీవ్ర స్థాయిలో విమర్శల దాడిని కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగా దేశంలో నిరుద్యోగం క్రమంగా పెరుగుతున్నదని ఆరోపించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. "2024లో (అధికారంలోకి) బీజేపీ రాదని నేను నమ్ముతున్నాను. భారతదేశంలో నిరుద్యోగం 40% పెరుగుతోంది. బెంగాల్‌లో 45% తగ్గింది... ఈరోజు మీడియా విచారణ జరుగుతోంది & వారిని నిందితులుగా పిలుస్తున్నారు. బెంగాల్‌పై చెడు అభిప్రాయాన్ని సృష్టించాలని వారు కోరుకుంటున్నారు" అని పేర్కొన్నారు.
school recruitment scam కు సంబంధించి ఆమె క్యాబినెట్ colleague, సీనియర్ TMC నాయకుడు పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత మమత బెనర్జీ.. కేంద్ర బీజేపీ సర్కారుపై విమర్శల దాడిని కొనసాగించారు. "వారికి (బీజేపీ) పని లేదు.. 3-4 ఏజెన్సీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను స్వాధీనం చేసుకోవడం వారి పని. వారు మహారాష్ట్ర అదే తరహాలో స్వాధీనం చేసుకున్నారు.. ఇప్పుడు జార్ఖండ్‌ను తీసుకున్నారు, కానీ బెంగాల్ వారిని ఓడించింది. బెంగాల్‌ను విచ్ఛిన్నం చేయడం సులభం కాదు.. రాయల్ బెంగాల్ టైగర్ ముందు మీరు పోరాడవలసి ఉంటుంది.’’ అని సీఎం అన్నారు.
టిటాగర్ బండ్ల కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తూ.. తన పార్టీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ.. దానికి అనుకూలంగా ప్రచారం సాగిస్తున్న ఓ వర్గం మీడియాపై ఆమె విమర్శలు గుప్పించారు. "మీరు ఒక పెద్ద సంస్థను నడుపుతున్నప్పుడు, తప్పులు ఉండవచ్చు. ఎవరైనా ఏదైనా తప్పు చేసి, అది చట్టపరంగా రుజువైతే, అతను లేదా ఆమె శిక్షించబడాలి. కానీ నేను ఏదైనా హానికరమైన మీడియా ప్రచారానికి వ్యతిరేకం. మీడియా కంగారు పాత్ర పోషిస్తోంది.. ఇటీవల ఒక సీనియర్ న్యాయమూర్తి కూడా చెప్పారు" అని మమతా అన్నారు. ప్రతిపక్ష నేతలతో పాటు వ్యాపారవేత్తలను కూడా కేంద్రంలోని అధికార బీజేపీ ఆదేశానుసారం ఏజెన్సీలు బెదిరింపులకు గురిచేస్తున్నాయని మమత పేర్కొన్నారు. ఏజెన్సీలు నిష్పక్షపాతంగా పనిచేస్తే తనకేమీ ఇబ్బంది లేదని.. పార్టీలను కించపరిచేందుకు వీటిని ఉపయోగించరాదని ఆమె అన్నారు.
"ఈ రోజుల్లో, మీరు దేనిపైనా నిరసన వ్యక్తం చేస్తే, మీరు సస్పెండ్ చేయబడతారు" అని మంగళవారం రాజ్యసభ నుండి 19 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ అయిన విషయాన్ని ప్రస్తావించారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో ఏడుగురు టీఎంసీ, ఆరుగురు డీఎంకేకు చెందినవారు ఉన్నారు.
