Asianet News TeluguAsianet News Telugu

చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ లో సూదులు గుచ్చి... ప్రియుడితో కలిసి చంపేసిన తల్లికి మరణశిక్ష

చిన్నారి శరీరం నుంచి ఆపరేషన్ల ద్వారా మొత్తం ఏడు సూదులు తొలగించారు. కానీ, చిన్నారిని రక్షించలేకపోయారు. ఆ చిన్నారి కేసులు సాక్ష్యమిచ్చిన 37 మందిలో, 10 రోజులపాటు తీవ్రప్రయత్నం చేసిన  17 మంది వైద్యులు, ఒక సీనియర్ నర్సు కూడా ఉన్నారు.

West Bengal : Three-year-old s mom, paramour get death for needle murder
Author
Hyderabad, First Published Sep 22, 2021, 9:37 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పురూలియా : మూడున్నరేళ్ల చిన్నారి హత్య కేసులో.. ఆమె తల్లి, 70 యేళ్ల తాంత్రికుడు ఇద్దరికీ పురూలియా కోర్టు మరణశిక్షను విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. 2017 జూలైలో బెంగాల్‌ లో జరిగిన ఓ భయంకరమైన ఘటనలో నిన్న తీర్పు వెలువడింది.

2017 జూలైలో బెంగాల్ లో ఈ సంఘటన ఒక్కసారి దిగ్భాంతికి గురిచేసింది. మూడున్నరేళ్ల చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ లో సూదులు గుచ్చడంతో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. ఆమెను మొదట పురులియా మెడికల్ కాలేజీ హాస్పిటల్, తరువాత బంకురా సమ్మిలానీ మెడికల్ కాలేజీ హాస్పిటల్.. చివరకు ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్‌లో చిన్నారిని తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు, సర్జన్ లు 10 రోజుల పాటు అహర్నిశలూ చిన్నారిని కాపాడడానికి ప్రయత్నించారు. 

చిన్నారి శరీరం నుంచి ఆపరేషన్ల ద్వారా మొత్తం ఏడు సూదులు తొలగించారు. కానీ, చిన్నారిని రక్షించలేకపోయారు. ఆ చిన్నారి కేసులు సాక్ష్యమిచ్చిన 37 మందిలో, 10 రోజులపాటు తీవ్రప్రయత్నం చేసిన  17 మంది వైద్యులు, ఒక సీనియర్ నర్సు కూడా ఉన్నారు.

ఈ ఘటన బెంగాల్ అంతటా తీవ్ర కలవరం రేపింది. చిన్నారి మరణానికి సూదులు తల్లే గుచ్చింది. చిన్నారి అనారోగ్యం నుంచి కోలుకోవాలని మాంత్రికురాలు చెప్పినట్టు మూఢంగా నమ్మి ఆమె తల్లి... ప్రైవేట్ పార్ట్స్ లో సూదులు గుచ్చింది. దీంతో చిన్నారి అస్వస్థత మరింత ఎక్కువై.. ఆ చిత్రహింస భరించలేక మరణించింది. 

ఈ కేసును న్యాయమూర్తి రమేష్ కుమార్ ప్రధాన్ ఈ హత్యను "అరుదైన వాటిల్లో అరుదైనది" అని పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయవాదులు అన్వర్ అలీ అన్సారీ, అరుప్ భట్టాచార్య మాట్లాడుతూ, "తల్లి ఒడికి మించిన రక్షణ శిశువుకు ఎక్కడా లభించదు. కానీ ఈ కేసులు ఆ చిన్నారి నిస్సహాయంగా మరణించాడానికి ఆ తల్లే కారణమని కోర్టు చెప్పింది." ఈ కేసులో ట్రయల్ కోర్టులు ఇచ్చిన మరణశిక్షలను హైకోర్టు ధృవీకరించాలి.

ఢిల్లీలో అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఐదుగురు అరెస్ట్..!

జూలై 11, 2017 న, పురూలియా పట్టణానికి కాస్త దూరంగా ఉన్న నదియారా గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. దీంతో వారు మామూలు కేసు అనుకుని అక్కడికి వెళ్లారు. స్థానికుల కథనం మేరకు... గతంలో హోం గార్డుగా పనిచేసిన సనాతన్ గోస్వామి, భర్త విడిచిపెట్టిన మంగళ గోస్వామితో కలిసి ఉంటున్నాడు. 

సనాతన్ గోస్వామి ప్రస్తుతం మతపరమైన సమావేశాలకు కీర్తనలు పాడుతూ, తాంత్రిక పూజలు చేస్తుంటాడు. మంగళ గోస్వామికి మూడున్నరేళ్ల కూతురు ఉంది. గత రెండు వారాలుగా ఆ చిన్నారి జ్వరంతో బాధపడుతూ, గుక్కపట్టి ఏడుస్తున్నా.. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి మంగళ గోస్వామి ఒప్పుకోలేదు. చూసీ చూసీ విసిగిపోయిన గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. 

అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారిని పురులియా ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఎక్స్-రేలు తీసిన వైద్యులు షాక్ కు గురయ్యారు. ఆ చిన్నారి ఛాతీ, పొత్తి కడుపు, ప్రైవేట్ భాగాలలో ఏడు సూదులు గుచ్చుకున్నట్లు గుర్తించారు. కాగా, జూలై 12న సనాతన్ పారిపోయాడు. అతనిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. జూలై 22 న చిన్నారి మరణించిన ఒక రోజు తర్వాత మంగళను అరెస్టు చేశారు.

నలుగురు సభ్యుల పోలీసు బృందం సనాతన్ బంధువులను ప్రశ్నించడానికి పురులియా నుండి మొదట ఢిల్లీకి వెళ్లింది. అతని దగ్గరి బంధువు ఒకరు సోన్‌భద్ర జిల్లాలోని యుపి పిప్రిలో ఉండి కేబుల్ కంపెనీలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. కంపెనీ ఉద్యోగి డేటాబేస్ పోలీసులను అతని బంధువుకు, ఆపై సనాతన్‌ ఆచూకీ దొరికేలా చేసింది. అతను పిప్రిలోని తన ఇంట్లో దొరికాడు. సెప్టెంబర్ 12 న, పోలీసులు 550 పేజీల ఛార్జిషీట్‌ను 57 రోజుల్లో సమర్పించారు.

అయితే, సనాతన్ కుటుంబం అతని తరఫున న్యాయవాదిని పెట్టడానికి నిరాకరించింది. అంతే కాకుండా, అతని కోడలు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చింది. దీంతో మంగళ, సనాతన్ ఇద్దరూ కస్టడీలోనే ఉన్నారు. నాలుగు సంవత్సరాల విచారణ తరువాత, న్యాయమూర్తి ప్రధాన్ శుక్రవారం వారిని దోషులుగా నిర్ధారించారు.

Follow Us:
Download App:
  • android
  • ios