విద్యార్థిని కిడ్నాప్ చేసి, ఆపై సామూహిక అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులు
Kolkata: ఒక విద్యార్థినిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని, విద్యార్థిని నగ్న ఫొటోలను తమ మొబైల్ లో చిత్రీకరించారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. అయితే, జరిగిన దారుణం గురించి బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

Student kidnapped and then gang-raped: ఒక విద్యార్థినిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని, విద్యార్థిని నగ్న ఫొటోలను తమ మొబైల్ లో చిత్రీకరించారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. అయితే, జరిగిన దారుణం గురించి బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే, తాము ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగల్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఒక కాలేజీ విద్యార్థినిని ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని నగ్నంగా ఫొటోలు తీయడంతో పాటు అత్యాచార ఘటనను తమ మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. అయితే, బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.
జిల్లాలోని మందిర్ బజార్ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని ఫిర్యాదు అందుకున్న పోలీసులు తెలిపారు. బాధిత యువతి బ్యాంకులో పనివుండగా బయటకు వెళ్లిందనీ, ఈ క్రమంలోనే దారి మధ్యలో కిడ్నాపు చేశారని పేర్కొన్నారు. అనంతరం యువతిని దుండగులు సికందర్‌పుర్ జంక్షనులో ఎవరూ లేని ఓ ఇంట్లోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఫొటోలు, వీడియోలు తీసి ఎవరికీ చెప్పవద్దని బెదిరించి వదిలిపెట్టారు. బాధితురాలు కుటుంబం విషయం తెలుసుకుని పోలీసులకు అదే రాత్రి ఫిర్యాదు చేసింది.
అయితే, తమ ఫిర్యాదు అందుకున్న తర్వాత కూడా నిందితులపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు ఈ రోపణలు ఖండిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదుచేశామనీ, బాధితురాలిని కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం, వాంగ్మూలం సైతం నమోదుచేశామని చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని గుర్తించామనీ, ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.