West Bengal SSC scam: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలోకి తీసుకుంది. రేపు ఆమెను ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
West Bengal SSC scam: పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో పశ్చిమ బెంగాల్ క్యాబినెట్ మంత్రి, మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను ఆదివారం కోర్టు ముందు హాజరుపరిచింది ఈడీ. అర్పితా ముఖర్జీని రిమాండ్ కు తరలించాలని ఈడీ కోరింది. దీంతో కోర్టు.. ఆమెను ఒకరోజు ఈడీ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించింది. ఆమెను సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
ఆదివారం తెల్లవారుజామున ఆమెను కోల్‌కతాలోని బ్యాంక్‌షాల్ కోర్టులో హాజరుపరిచారు. ఇందుకోసం ఈడీ అధికారులు అర్పితా ముఖర్జీని కోల్‌కతాలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి బ్యాంక్‌షాల్ కోర్టుకు తరలించారు. కోర్టులో హాజరు పరుస్తున్న సందర్భంగా ఆమెను రిమాండ్‌లో తీసుకోవాలని ED దరఖాస్తు చేసింది,
పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యుబిఎస్‌ఎస్‌సి) రిక్రూట్‌మెంట్ అవకతవకల స్కామ్‌పై ఏజెన్సీ దాడులు చేస్తున్న సమయంలో అర్పితా ముఖర్జీ ఇంటి నుండి ఇడి భారీ మొత్తంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఈడీ రికవరీ చేసుకుంది.
అర్పిత పశ్చిమ బెంగాల్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలు అని కేంద్ర ఏజెన్సీ అధికారుల విచారణలో వెల్లడైంది. అర్పితా ముఖర్జీ ఇంటిలో ED నిర్వహించిన దాడిలో రూ. 20 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో విచారణలో అర్పిత అనేక ముఖ్యమైన సమాచారాన్ని వెల్లడించినట్లు ED వర్గాల సమాచారం
మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన అర్పిత.. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించింది. కానీ, అంతగా.. ఆ రంగంలో రాణించలేకపోయింది. ఈ క్రమంలో మంత్రి పార్థ ఛటర్జీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మరింత సన్నిహితురాలుగా మర్చింది. ఈ కేసులో అర్పిత కూడా ఈడీ అరెస్ట్ చేసింది. అధిక ఆశయాల కారణంగా అర్పిత తన వితంతువు తల్లి మినోతి ముఖర్జీని కోల్‌కతాలోని ఉత్తర శివార్లలోని బెల్ఘరియాలోని తన పూర్వీకుల ఫ్లాట్‌లో విడిచిపెట్టినట్లు ED వర్గాలు తెలిపాయి.
అర్పిత తల్లి ఆవేదన
దక్షిణ కోల్‌కతాలోని డైమండ్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని (నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న) ఫ్లాట్‌కి మారినప్పటి నుండి తన కుమార్తెతో తన సంబంధం క్షీణించిందని మినోతి ముఖర్జీ మీడియాకు తెలిపారు. తన ఫ్లాట్‌లో భారీగా నగదు దొరికినట్లు మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నానని మినోతి ముఖర్జీ మీడియాకు తెలిపారు. ఇంతకు ముందు చాలాసార్లు ఆమె ఏం చేస్తుందని అడిగాను. కానీ, నాకు ఎప్పుడూ ఖచ్చితమైన సమాధానమివ్వలేదు. అలాంటి విషయాలు నాకు తెలిసి ఉంటే, నేను ఖచ్చితంగా ఆమెకు పెళ్లి చేసి ఉండేదానిని అని తెలిపారు.
కాగా, అర్పితా ముఖర్జీ దివంగత తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని, ఆమె పదవీ విరమణకు ముందే మరణించారని ED వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో అర్పితకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే, ఆమె ఆ ఉద్యోగాన్ని అంగీకరించడానికి నిరాకరించింది. మోడలింగ్, నటన రంగంలో కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఆమె మోడలింగ్, ఒడియా చిత్రాలలో నటించిన ప్రారంభ సంవత్సరాలలో ఆమె తన తల్లితో టచ్‌లో ఉందని వెల్లడించింది.
