Asianet News TeluguAsianet News Telugu

తుపాకీ, న్యూస్ పేపర్‌తో స్కూల్‌లోకి వెళ్లాడు.. ముప్పు తప్పించిన పోలీసులు

పశ్చిమ బెంగాల్‌లో ఓ స్కూల్‌లోకి తుపాకీ, న్యూస్ పేపర్‌తో ఓ వ్యక్తి వెళ్లాడు. అక్కడ తుపాకీని గాల్లో తిప్పుతూ పేపర్ చదివాడు. స్కూల్ యాజమాన్యం సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సమస్యలతో సతమతమై ఇలా ప్రవర్తించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
 

west bengal man went into classroom with gun and news paper, police took him into custody kms
Author
First Published Apr 27, 2023, 2:36 AM IST

కోల్‌కతా: ఓ వ్యక్తి తుపాకీ, న్యూస్ పేపర్‌తో స్కూల్‌లోకి వెళ్లాడు. ఓ క్లాస్ రూమ్‌లోకి వెళ్లి పేపర్ తిరగేయడం మొదలు పెట్టాడు. పేపర్ చదువుతూ మరో చేతిలోకి గన్ తీసుకుని భయభ్రాంతులకు గురి చేశాడు. క్లాస్ రూమ్ నిండా పిల్లలే ఉన్నారు. ఏ క్షణంలోనైనా వారికి ముప్పు జరిగే ప్రమాదం ఉన్నది. ఇంతలోనే అక్కడకు పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని పట్టుకుని బయటకు వచ్చారు. ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో బుధవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

పోలీసుల ప్రకారం, మాల్డాలోని మచియా చాంద్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి గన్‌తో క్లాసు రూమ్‌లోకి వెళ్లి కూర్చున్నాడు. ఆ తర్వాత న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టాడు. యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసుల బృందం అక్కడికి వచ్చింది. ఆ వ్యక్తికి తెలియకుండా క్లాసు రూమ్‌లోకి పోలీసులు వెళ్లారు. వెంటనే అతన్ని బంధించారు. గన్‌ను మరొకరు తీసుకున్నారు. ఏ ప్రమాదం జరగకుండానే ఆ వ్యక్తిని విజయవంతంగా అదుపులోకి తీసుకోగలిగారు. ఆయన వద్ద నుంచి పెట్రోల్ బాంబులనూ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

Also Read: Defamation Case: గుజరాత్ హైకోర్టులో రాహుల్ పిటిషన్.. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి

ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో ఉన్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. భార్య తన కొడుకును తనకు దూరం చేసి తీసుకెళ్లిందని ఇంటరాగేషన్‌లో ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. తాను పోలీసులు, ఉన్నత అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసినా ఫలితంగా లేకుండా పోయిందని వివరించాడు. 

ఆ వ్యక్తి కుటుంబ సమస్యలతోనే ఇలా ప్రవర్తించి ఉంటాడని పోలీసులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios