Asianet News TeluguAsianet News Telugu

ఫోక్ సింగ‌ర్ పై దాడి.. ఆపై అత్యాచారం.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

Kolkata: కోల్‌కతాలో ఒక మహిళా జానపద గాయనిపై వ్యాన్ రిక్షా డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
 

West Bengal: Kolkata Woman folk singer raped, accused arrested
Author
Hyderabad, First Published Jul 16, 2022, 9:48 AM IST

Woman folk singer raped: దేశంలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిత్యం ఏదో ఒక‌చోట వారిపై లైంగిక‌దాడులు, హింస, అఘాయిత్యాలు పెరుగుతుండ‌టం షాక్ గురిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఒక మ‌హిళా జాన‌ప‌ద గాయ‌నిపై ప‌ట్ట‌ప‌గ‌లు ఓ రిక్షాపుల్ల‌ర్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆమెపై దాడి చేసి.. బాధితురాలి వ‌ద్ద వున్న డ‌బ్బు, న‌గ‌లు దొచుకుని పారిపోయాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న బెంగాల్ లో చోటుచేసుకుంది. పోలీసులు కేసు న‌మోదుచేసుకునీ, విచార‌ణ జ‌రుపుతున్నారు. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

కోల్‌కతా స్టేషన్ ప్రాంతంలో మహిళా జానపద గాయనిపై వ్యాన్ రిక్షా పుల్లర్ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఉల్తదంగా పోలీస్ స్టేషన్‌లో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదుచేసుకున్నారు. ఈ దారుణానికి ఒడిక‌ట్టిన నిందితుడిని స్థానికంగా అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆరోపించిన ఈ సంఘటన జూలై 12 మధ్యాహ్నం జరిగింది. నిందితుడిని నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన బాధితురాలు ద‌క్షిణ్‌దారి ప్రాంతంలో నివాస‌ముంటున్నారు. అయితే,  కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు ఆ ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలిపారు. ఆ సమయంలో వర్షం కురుస్తుందని, షెడ్డు కింద తలదాచుకున్నారని, ఆ సమయంలోనే నిందితులు వెనుక నుంచి వచ్చి సమీపంలోని ముళ్లకంచె వద్దకు ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మహిళపై అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు ఆమె ధరించిన బంగారు ఆభరణాలతో పాటు ఆమె సామాన్లన్నింటినీ తీసుకుని పారిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. ఆ మహిళ రెండు రోజులుగా అనారోగ్యంతో ఉందని, ఆరోపించిన సంఘటన తర్వాత ఇంట్లోనే ఉందని, శుక్రవారం తన బంధువుతో కలిసి ఉల్తాదంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. "మహిళకు వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. నిందితులపై దొంగతనం కేసుతో పాటు అత్యాచారం కేసును న‌మోదుచేశాము. దీనిపై విచార‌ణ ప్రారంభించాము" అని పోలీసు అధికారి తెలిపారు. లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బాధితురాలి పూర్తి గుర్తింపును అధికారులు వెల్ల‌డించ‌లేదు. 

దేశరాజధాని ఢిల్లీలోనూ.. 

కారులో ఒక మైన‌ర్ బాలిక‌పై సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డిన  ఘటన దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుల‌పై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదుచేసుకునీ, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి... కదులుతున్న కారులో 16 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు, నేరం జరిగిన సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి సహా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురూ 23, 25, 35 ఏళ్ల వయస్సు గలవారేన‌ని IANS నివేదించింది. జూలై 7 మ‌ధ్య రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  బాధితురాలు తనకు గతంలో తెలిసిన ఇద్దరు వ్యక్తులను కలవడానికి వెళ్ళినప్పుడు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నిందితులపై సెక్షన్‌లు 323 (దాడి), 342 (తప్పుగా నిర్బంధించడం), 354 (వేధింపు), 376 డి (గ్యాంగ్‌రేప్), 377 (అసహజ నేరం), 363 (మైనర్‌ని కిడ్నాప్ చేయడం), 506 (క్రిమినల్ బెదిరింపు) సెక్ష‌న్ల‌తో పాటు POCSCO చ‌ట్టం కింద కేసు న‌మోదుచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios