పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు బాలికను దారుణంగా హత్య చేసి, నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని హోగోల్‌బెరియాలోని సోందల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

రోజురోజుకూ మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. బడి, గుడి, బస్సు, రోడ్డు అంటూ తేడా లేకుండా కామాంధులు అన్ని చోట్లా కాపు కాస్తున్నారు. తమ కోరికను కాదంటే.. ఎంతటీ దారుణానికైనా పాల్పడుతున్నారు. తాజా పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఓ బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన పెళ్లి ప్రతిపాదనను నిరాకరించినందుకు ఓ దుండగుడు బాలికను హత్య చేశాడు. రక్తస్రావమైన బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్య అనంతరం యువకుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అమ్మాయి బంధువులు నిందితుడి ఇంటిని తగులబెట్టారు.

మృతురాలిని సోనాలిగా గుర్తించగా, హంతకుడు బ్రిజెన్ మండల్ (45)గా గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో బాలిక ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తోంది. సమాచారం ప్రకారం.. ఈ సంఘటన బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని హోగోల్‌బెరియాలోని సోందల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోనాలి ఇల్లు హోగోల్‌బెరియా పోలీస్ స్టేషన్‌లోని సోండల్‌పూర్‌లో ఉంది. వార్తల కథనాల ప్రకారం.. నిందితుడు బ్రజన్ మండల్‌కి నలభై ఐదు సంవత్సరాలు. గతేడాది నుంచి తనని పెళ్లి చేసుకోవాలని సోనాలిని బలవంతం చేస్తున్నాడు. తన పెళ్లి ప్రతిపాదనను యువతి తిరస్కరించడంతో ఆమెపై రకరకాలుగా ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపించారు. 

ఇదిలా ఉండగా సోనాలి బ్రజెన్‌ను మామ అని పిలిచేదని స్థానికులు కూడా చెబుతున్నారు. గతంలో బాలిక కుటుంబం బ్రజెన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. పోలీసుల నుండి విడుదలైన తర్వాత బ్రజెన్ మళ్లీ సోనాలిని వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సోనాలి శనివారం ఉదయం ట్యూషన్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, నిందితులు ఆమె మెడపై, నడుముపై పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి చంపినట్లు సమాచారం. అరుపులు విన్న ప్రజలు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.