Asianet News TeluguAsianet News Telugu

West Bengal Exit Poll Result 2021: మమతదే బెంగాల్ తేల్చి చెప్పిన ఈటీజీ రీసెర్చ్, పి మార్క్ సర్వేలు

బెంగాల్ లో మమతా మరోసారి విజయబావుటా ఎగురవేయుట ఖాయమని ఈటీజీ, పి  మార్క్ సర్వేలు తేల్చి చెప్పాయి. 

West Bengal Exit Poll Result 2021: Mamata Banerjee to win a hat trick victory in bengal, predicts ETG Research and P- MARQ
Author
Kolkata, First Published Apr 29, 2021, 7:38 PM IST

నెల రోజులపాటు 8 విడతల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆఖరి విడత పోలింగ్ ఇందాక కొద్దిసేపటి క్రితం ముగిసింది. పోలింగ్ పూర్తవడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడుతున్నాయి. బెంగాల్ లో మమతా మరోసారి విజయబావుటా ఎగురవేయుట ఖాయమని ఈటీజీ, పి  మార్క్ సర్వేలు తేల్చి చెప్పాయి. 

ఈటీజీ  రీసెర్చ్ 

టీఎంసీ 164- 176  

బీజేపీ 105 - 115

కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి 10 - 15 సీట్ల మధ్య సాధించవచ్చని పేర్కొంది. మరోసర్వే పి మార్క్ కూడా టీఎంసీ గెలుపు ఖాయమని తేల్చింది. 

పి మార్క్ సర్వే 

టీఎంసీ 152- 172  

బీజేపీ 112 - 132

 కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి 10 - 20  సీట్ల మధ్య సాధించవచ్చని పేర్కొంది

కరోనా వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగాయి. 27 మర్చి నుంచి 29 ఏప్రిల్ వరకు 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. జంగిపూర్, షంషేర్ గంజ్  ఆకస్మిక మరణం కారణంగా ఎన్నికల సంఘం ఈ రెండు స్థానాల ఎన్నికలను వాయిదా వేసింది. అక్కడ ఉపఎన్నిక మే 16వ తేదీన జరగనున్నాయి. 

మొత్తం 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 148 మేజిక్ ఫిగర్. ఎలాగైనా ఈసారి బెంగాల్ లో కాషాయ జెండా రెపరెపలాడించాలని బలంగా భావించిన బీజేపీ, మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకొని హాట్ ట్రిక్ కొట్టాలని మాత బెనర్జీ, అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్- లెఫ్ట్ కూటమి బరిలో నిలిచాయి. శాయశక్తులా ఎన్నికలో విజయం సాధించేందుకు తుదికంటా పోరాడాయి. 

ఇక ఈ ఎన్నికల్లో హిందుత్వ అస్త్రాన్ని, పరివర్తన నినాదాన్ని భుజానికెత్తుకొని బీజేపీ ప్రచారం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పూర్తిగా బెంగాల్ ఎన్నికల మీద దృష్టిసారించి నెల రోజుల్లో దాదాపుగా తమ పర్యటనలను ప్లాన్ చేసుకొని ప్రచారం నిర్వహించారు. 

మరోపక్క మమతా బెనర్జీ బెంగాలీ అస్థిత్వాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. బెంగాలీలు కాని అమిత్ షా, మోడీ లు వచ్చి బెంగాల్ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, బెంగాలీలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయకూడదని బలంగా ప్రచారం నిర్వహించారు. 

ఇక ఈ ఎన్నికల పర్వం మొత్తం మాత బెనర్జీ వీల్ చైర్ లో కూర్చొనే ప్రచారం చేసారు. హై వోల్టేజి ఎన్నికల యుద్ధం ఇక్కడ వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళింది. బములు విసురుకోవడం, తుపాకీ కాల్పులు అన్ని వెరసి ఎన్నికల వాతావరణం ఒకింత హింసాత్మకంగా మారింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత బెనర్జీ కోసం ఈ ఎన్నికల్లో పనిచేసారు. ఆయన వ్యూహాలు మమతా బెనర్జీని గట్టెక్కిస్తాయో లేదా పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన విజయం జోష్ లో బీజేపీ ఇక్కడ జెండా పాతుందా తెలియాలంటే మే 2వ తేదీ వరకు ఆగాల్సిందే..!

Follow Us:
Download App:
  • android
  • ios