Mamata Banerjee: మోకాలికి గాయమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శస్త్ర చికిత్స అనంతరం గురువారం  సాయంత్రం  ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎడమ మోకాలి గాయానికి గురువారం (జూలై 6) శస్త్రచికిత్స జరిగింది. అయితే..  ఆమె త్వరగా కోలుకోవడంతో డాక్టర్లు నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, కార్యకలాపాలు పరిమితం చేసుకోవాలని  వైద్యులు సూచించారు

అసలేం జరిగింది...?

రాష్ట్రంలో జూలై 8న జరగనున్న పంచాయితీ ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల ఉత్తరాది జిల్లాల పర్యటన తర్వాత బెనర్జీ జూన్ 27న కోల్‌కతాకు తిరిగి వస్తున్నారు. ఈ సమయంలోనే ఆమె ప్రయాణిస్తున్న అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ను సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో ఆమె ఎడమ మోకాలి ,ఎడమ హిప్ జాయింట్‌కు కూడా గాయాలయ్యాయి. మమతా బెనర్జీ గాయపడిన తర్వాత బాగ్డోగ్రా విమానాశ్రయం నుండి కోల్‌కతాకు తిరిగి వచ్చారు. ఆమె బాగ్డోగ్రా విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో వచ్చారు.

ప్రమాదానికి ముందు బెనర్జీ జల్పాయిగురిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీని టార్గెట్ చేస్తూ పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ మాత్రమే గెలుస్తుందని చెప్పారు. ఎన్నికలకు మా పార్టీ పూర్తిగా సిద్ధమైంది. మరోవైపు, పంచాయితీ ఎన్నికల్లో తాము విజయం సాధించామని పేర్కొంటూ పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై బెనర్జీ ప్రభుత్వంపై కాంగ్రెస్ , బీజేపీ కూడా నిరంతరం దాడి చేస్తున్నాయి.