కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి !
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు అషిమ్ బెనర్జీ శనివారం కరోనాతో మృతి చెందాడు. గత కొద్దికాలంగా కరోనాతో బాధపడుతున్న అషీమ్ బెనర్జీ కలకత్తాలోని మెడికల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు అషిమ్ బెనర్జీ శనివారం కరోనాతో మృతి చెందాడు. గత కొద్దికాలంగా కరోనాతో బాధపడుతున్న అషీమ్ బెనర్జీ కలకత్తాలోని మెడికల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
కాగా, శుక్రవారం, పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా 20,846 తాజా COVID-19 కేసులను నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,94,802 కు చేరుకుంది.
శుక్రవారం 136 మంది కోవిడ్ రోగుల మృతితో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 12,993 కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది.
ఇలా ఉండగా, మరో మాజీ ముఖ్యమంత్రి సోదరుడు కూడా మరణించడం విషాదం. అన్నాడీఎంకే సమన్వయకర్త, తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంట విషాదం చోటుచేసుకుంది. పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ (55) అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.
కరోనా కాటు.. అమరవీరుడు భగత్ సింగ్ బంధువు కన్నుమూత..!...
వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాల మురుగన్.. దాదాపు మూడు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. రెండు, మూడు శస్త్ర చికిత్సలు కూడా చేసుకున్నారు. అయినా.. ఆరోగ్యం కుదుటపడలేదు.
కొన్నిరోజుల క్రితం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం నుంచి కోలుకుని గురువారం రాత్రి తేని జిల్లా పెరియకుళత్తిలోని ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏమి జరిగిందో కాని శుక్రవారం తెల్లవారుజాము 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.
బాలమురుగన్‌కు భార్య లతా మహేశ్వరి, కుమార్తె ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఫోన్ ద్వారా పన్నీర్‌సెల్వంతో మాట్లాడారు. సంతాపం వ్యక్తం చేశారు.