ఓ బీజేపీ ఎంపీ ఇంటిపై కొందరు ఆగంతకులు బాంబులతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ పరిగణాన్ జిల్లాలో చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ అర్జున్ షింగ్ ఇంటిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. బాంబులు వేయడంతో వారు ఆగలేదు. తుపాకీలతో కొద్ది సేపు కాల్పులు జరిపారు.

అదృష్టం ఏమిటంటే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా... దాడికి పాల్పడింది ఎవరూ అన్న విషయం మాత్రం తెలియలేదు. ఈ ఘటనపై ఎంపీ ఫిర్యాదు మేర పశ్చిమబెంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ ఇంటి ముందు సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనలో ఎవరి హస్తముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.