న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుండి రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం నాడు ఐదు అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకొన్నాయి.

రాఫెల్ యుద్ధ విమానాలకు ఎస్‌యూ-30 విమానాలు స్వాగతం పలికాయి. ఈ విమానాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
17వ వైమానిక స్క్రాడన్ లో  రాఫెల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఆగష్టులో రెండో విడతలో భారత్ కు యుద్ధ విమానాలు రానున్నాయి.

 

రాఫెల్ తో మరింత బలోపేతం కానుంది భారత వైమానిక వ్యవస్థ. 9500 కిలోల ఆయుధాలు మోసుకెళ్లగలిగే సత్తా రాఫెల్ స్వంతం. నిమిషానికి 2500 రౌండ్లు పేల్చే సామర్ధ్యం రాఫెల్ స్వంతం. ఫ్రాన్స్, ఈజిఫ్ట్, ఖతార్ తర్వాత రాఫెల్ కలిగి ఉన్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది.

యూఏఈ నుండి ఎయిర్ బేస్ నుండి అంబాలాకు ఇవాళ మధ్యాహ్నం రాఫెల్ యుద్ధ విమానాలు  అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండయ్యాయి.శత్రు శిబిరాలను క్షణాల్లో ధ్వంసం చేసే సామర్ధ్యం ఈ విమానాలకు ఉంది. 

రాఫెల్ ఫైటర్ జెట్స్ రేంజ్ 3 వేల 700 కి.మీ. గంటకు 1912 కి.మీ వేగంగా ప్రయాణం చేసే సామర్ధ్యం రాఫెల్ స్వంతం. పర్వత ప్రాంతాల్లో పోరాటానికి రాఫెల్ కీలకంగా పనిచేయనుంది.

50 వేల అడుగుల ఎత్తుకు కూడ ఎగిరే సామర్ధ్యం ఈ యుద్ధ విమానాలకు ఉంటుంది. వేగం, కచ్చితత్వం రాఫెల్ ప్రత్యేకత అణ్వాయుధాలను కూడ ఈ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు.ఐదు రాఫెల్ యుద్ధ విమానాల్లో రెండు శిక్షణ విమానాలు. కాగా మరో మూడు యుద్ధ విమానాలు.