కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కర్నాటక లో వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు మాగడి రోడ్డులో ఆదివారం ఉదయం 10.30 గంటలకు వేగంగా వస్తున్న టూ వీలర్ ను పోలీసులు అడ్డుకుని ఆపారు. వీకెండ్ లాక్ డౌన్ ఉన్న విషయం తెలియదా? అంటూ వారిని గద్దించారు.

‘సార్.. నేను పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్నాను.. ఏ వెహికిల్ దొరకక స్నేహితుడితో కలిసి వెల్తున్నాను...’ అంటూ ద్విచక్ర వాహనం వెనుక తెల్ల చొక్కా, ప్యాంటు వేసుకుని కూర్చున్న యువకుడు బదులిచ్చాడు.
‘తప్పించుకుపోయేందుకు ఏ వంకా దొరకలేదా? పెళ్లి అని అబద్దం ఆడుతున్నావ్..’ అంటూ పోలీసులు గట్టిగా నిలదీశారు. దీంతో ఆ యువకుడు తన జేబులో ఉన్న శుభలేఖను తీసి చూపించాడు.
‘సార్, చూడండి.. నేనే వరుడ్ని.. కల్యాణ మండపంలో వివాం చేసుకుందామని అనుకుంటే, అనుమతి దొరకలేదు, గుడి ఆవరణలో పెళ్లి చేసుకుంటున్నాను. ఇప్పటికే వధువు, ఆమె కుటుంబసభ్యులు, మా తల్లిదండ్రులు, కొందరు బంధువులు గుడికి చేరుకున్నారు’ అని చెప్పాడు.
అంతేకాదు ముహూర్తానికి సమయం మించి పోతోందని.. తనను వదిలేయమని పోలీసులతో మొరపెట్టుకున్నాడు. అతను నిజమే చెబుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు పెళ్లికి పది నిమిషాల టైం పెట్టుకుని ఇప్పుడా వెళ్లేది.. అని కోప్పడి పెళ్లి శుభాకాంక్షలు చెప్పి.. వారిని విడిచి పెట్టారు.