నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Wednesday 10th August Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:35 PM IST

జనం నమ్మరు.. కాంగ్రెస్‌పై మోడీ విమర్శలు

ఇటీవలి కాంగ్రెస్ నిరసనను తప్పుబట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. నిరాశ, నిస్పృహల్లో వున్న కొందరు చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని మాయలు చేసినా, మూఢ నమ్మకాలను పాటించినా వారిని ప్రజలు నమ్మరంటూ మోడీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

8:21 PM IST

విమాన టికెట్‌లపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో విమాన టికెట్లకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీల్లో పరిమితులను తొలగించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం తెలిపారు. ఆగస్ట్ 31 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సింధియా వెల్లడించారు. 

7:32 PM IST

కొత్త సీజేఐగా జస్టిస్ యు.యు. ఉమేశ్

జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియామకం అయ్యారు. సుప్రీంకోర్టు 49వ సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఓ ప్రకటన వెలువరించింది.

6:30 PM IST

బాబా గుడిపై వ్యాఖ్యలు... వివాదంలో కలెక్షన్ కింగ్

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం, రంగంపేటలో పెద్ద సాయిబాబా గుడిని నిర్మించారు మోహన్‌బాబు. ఇది దక్షిణాదిలోనే అతిపెద్ద టెంపుల్‌ కావడం విశేషం. మంగళవారం ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోహన్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, ఈ గుడి దక్షిణాదిలోనే అతి పెద్ద సాయిబాబా దేవాలయమని తెలిపారు. ఇదొక అద్భుతంగా వర్ణించారాయన. తన దృష్టిలో ఇక భక్తులు షిర్డీ సాయినాథుని ఆలయానికి వెళ్లనక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బ తీసినట్టయ్యింది. 

5:33 PM IST

గోరంట్ల మాధవ్‌ది ఒరిజినల్ వీడియో కాదు : అనంత ఎస్పీ

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు అశ్లీల వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.ఈ వీడియో ఒరిజినల్ వీడియో కాదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ వీడియోను పోస్టు చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే వరకుప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు  ఫేక్ వీడియోలేనని ఆయన చెప్పారు. ఈ విషయమై ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప ఇది ఒరిజినలా నకిలీదా అనేది తేలుుందన్నారు.

4:31 PM IST

తదుపరి అసెంబ్లీ ఎన్నికలవరకు బొమ్మయే కర్ణాటక సీఎం: యడ్యూరప్ప క్లారిటీ

మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు వుంటుందని... బస్వరాజు బొమ్మై ను తొలగించి మరొకరిని సీఎం చేస్తారన్న ప్రచారంపై మాజీ సీఎం, బిజెపి సీనియర్ యడ్యూరప్ప క్లారిటీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ పదవీకాలం ముగిసేవరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా బొమ్మై కొనసాగుతారని యడ్యూరప్ప తెలిపారు. 
 
3:48 PM IST

పాము లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లోకే చొరబడింది...: కేంద్ర మంత్రి గిరిరాజ్ ఎద్దేవా

జేడియూ‌-ఆర్జేడీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ను పాముతో పోల్చిన ఆర్జేడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఇప్పుడు పాము మీ ఇంట్లోకే చొరబడిందంటూ కేంద్ర మంత్రి ఎద్దేవా చేసారు. 
 
3:17 PM IST

ఐసిసి టీ20 ర్యాకింగ్స్ లో రెండో  స్థానం సూర్యకుమార్ యాదవ్ దే

ఐసిసి టీ20 ర్యాంకింగ్స్  లో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్ మెన్స్ విభాగంలో  రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇదేక్రమంలో శ్రేయాస్ అయ్యర్ 19వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ అత్యుత్తమ టీ20 బ్యాట్స్  మెన్ గా పాకిస్థాన్ ఆటగాడు బాబర్  ఆజమ్ నిలిచాడు. 

2:26 PM IST

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణం

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణస్వీకారం చేసారు. అలాగే ఆర్జేడీ నాయకుడు తేజస్వియాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. 

2:17 PM IST

వైఎస్సార్ టిపి ముఖ్య అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి గా కొండా రాఘవ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టి అధినేత్రి వైఎస్ షర్మిల పేరిట ప్రకటన వెలువడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించారు. 

12:57 PM IST

వరవరరావుకు బెయిల్ మంజూరుచేసిన సుప్రీం కోర్టు

విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భీమా కోరేగావ్ కుట్ర కేసులో నిందితుడిగా వున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

11:52 AM IST

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్

అభిమానులకు అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ బాధాకరమైన వార్త చెప్పారు.  మరికొద్దిరోజుల్లో జరగనున్న యూఎస్ ఓపెన్ తర్వాత రిటైరవనున్నట్లు ఆమె ప్రకటించారు. 

11:16 AM IST

ఎంత సిగ్గుచేటు... జాతీయ పతాకాన్ని అమ్మకానికి పెడతారా..: వరుణ్ గాంధీ సంచలనం

భారత స్వాతంత్య్ర వేడుకలు 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ మహోత్సవాలపై బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసారు. జాతీయ పతాకాల పంపిణీ పేరుతో నిరుపేదలను ఇబ్బంది పెడుతున్నారని... రేషన్ షాపుల్లో 25 రూపాయలకు త్రివర్ణ పతాకాలు అమ్ముతున్నారని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. ఇలా పేదల నోటికాడి కూడును కూడా లాక్కుంటున్నారని బిజెపి ఎంపీ మండిపడ్డారు. 
 
10:41 AM IST

భారత్ లో తాజాగా 16,047 కరోనా కేసులు, 54 మరణాలు

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,047 కరోనా కేసులు వెలుగుచూసాయి. అలాగే కరోనాతో బాధపడుతున్న వారిలో 54 మంది మృతిచెందారు. తాజా కేసులతో కలిపితే దేశంలో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కరోనాకేసుల సంఖ్య 4,41,90,674 కు చేరుకోగా మరణాలు 5,26,826కు చేరుకున్నాయి.  

9:51 AM IST

రెండోసారి కరోనా బారినపడ్డప్రియాంక గాంధీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూతురు, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. మరోసారి తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు ప్రియాంక ట్విట్టర్ వేదికన ప్రకటించారు. కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ ఇంట్లోనే ఐసోలేషన్ లో వున్నట్లు ఆమె వెల్లడించారు. గతేడాది జూన్ లో కూడా ప్రియాంకకు కరోనా సోకగా తాజాగా మరోసారి ఆమె కరోనా బారినపడ్డారు.  

9:23 AM IST

తెలంగాణలో భారీ వర్షాలు... భద్రాచలం వద్ద మళ్లీ గోదారి ఉగ్రరూపం

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తడంతో గోదావరి నదిలో నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరడంతో రెండో ప్రమాదం హెచ్చరిక జారీ చేసారు.
 
9:35 PM IST:

ఇటీవలి కాంగ్రెస్ నిరసనను తప్పుబట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. నిరాశ, నిస్పృహల్లో వున్న కొందరు చేతబడిని ఆశ్రయిస్తున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని మాయలు చేసినా, మూఢ నమ్మకాలను పాటించినా వారిని ప్రజలు నమ్మరంటూ మోడీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

8:21 PM IST:

దేశంలో విమాన టికెట్లకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీల్లో పరిమితులను తొలగించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం తెలిపారు. ఆగస్ట్ 31 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సింధియా వెల్లడించారు. 

7:32 PM IST:

జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియామకం అయ్యారు. సుప్రీంకోర్టు 49వ సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఓ ప్రకటన వెలువరించింది.

6:30 PM IST:

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం, రంగంపేటలో పెద్ద సాయిబాబా గుడిని నిర్మించారు మోహన్‌బాబు. ఇది దక్షిణాదిలోనే అతిపెద్ద టెంపుల్‌ కావడం విశేషం. మంగళవారం ఈ గుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోహన్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, ఈ గుడి దక్షిణాదిలోనే అతి పెద్ద సాయిబాబా దేవాలయమని తెలిపారు. ఇదొక అద్భుతంగా వర్ణించారాయన. తన దృష్టిలో ఇక భక్తులు షిర్డీ సాయినాథుని ఆలయానికి వెళ్లనక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బ తీసినట్టయ్యింది. 

5:32 PM IST:

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు అశ్లీల వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.ఈ వీడియో ఒరిజినల్ వీడియో కాదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ వీడియోను పోస్టు చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే వరకుప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు  ఫేక్ వీడియోలేనని ఆయన చెప్పారు. ఈ విషయమై ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప ఇది ఒరిజినలా నకిలీదా అనేది తేలుుందన్నారు.

4:31 PM IST:

మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు వుంటుందని... బస్వరాజు బొమ్మై ను తొలగించి మరొకరిని సీఎం చేస్తారన్న ప్రచారంపై మాజీ సీఎం, బిజెపి సీనియర్ యడ్యూరప్ప క్లారిటీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ పదవీకాలం ముగిసేవరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా బొమ్మై కొనసాగుతారని యడ్యూరప్ప తెలిపారు. 
 
3:48 PM IST:

జేడియూ‌-ఆర్జేడీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ను పాముతో పోల్చిన ఆర్జేడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఇప్పుడు పాము మీ ఇంట్లోకే చొరబడిందంటూ కేంద్ర మంత్రి ఎద్దేవా చేసారు. 
 
3:17 PM IST:

ఐసిసి టీ20 ర్యాంకింగ్స్  లో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్ మెన్స్ విభాగంలో  రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇదేక్రమంలో శ్రేయాస్ అయ్యర్ 19వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ అత్యుత్తమ టీ20 బ్యాట్స్  మెన్ గా పాకిస్థాన్ ఆటగాడు బాబర్  ఆజమ్ నిలిచాడు. 

2:26 PM IST:

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణస్వీకారం చేసారు. అలాగే ఆర్జేడీ నాయకుడు తేజస్వియాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. 

2:17 PM IST:

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి గా కొండా రాఘవ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టి అధినేత్రి వైఎస్ షర్మిల పేరిట ప్రకటన వెలువడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించారు. 

12:57 PM IST:

విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భీమా కోరేగావ్ కుట్ర కేసులో నిందితుడిగా వున్న ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

11:52 AM IST:

అభిమానులకు అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ బాధాకరమైన వార్త చెప్పారు.  మరికొద్దిరోజుల్లో జరగనున్న యూఎస్ ఓపెన్ తర్వాత రిటైరవనున్నట్లు ఆమె ప్రకటించారు. 

11:16 AM IST:

భారత స్వాతంత్య్ర వేడుకలు 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ మహోత్సవాలపై బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసారు. జాతీయ పతాకాల పంపిణీ పేరుతో నిరుపేదలను ఇబ్బంది పెడుతున్నారని... రేషన్ షాపుల్లో 25 రూపాయలకు త్రివర్ణ పతాకాలు అమ్ముతున్నారని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. ఇలా పేదల నోటికాడి కూడును కూడా లాక్కుంటున్నారని బిజెపి ఎంపీ మండిపడ్డారు. 
 
10:41 AM IST:

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,047 కరోనా కేసులు వెలుగుచూసాయి. అలాగే కరోనాతో బాధపడుతున్న వారిలో 54 మంది మృతిచెందారు. తాజా కేసులతో కలిపితే దేశంలో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కరోనాకేసుల సంఖ్య 4,41,90,674 కు చేరుకోగా మరణాలు 5,26,826కు చేరుకున్నాయి.  

9:51 AM IST:

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూతురు, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. మరోసారి తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు ప్రియాంక ట్విట్టర్ వేదికన ప్రకటించారు. కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ ఇంట్లోనే ఐసోలేషన్ లో వున్నట్లు ఆమె వెల్లడించారు. గతేడాది జూన్ లో కూడా ప్రియాంకకు కరోనా సోకగా తాజాగా మరోసారి ఆమె కరోనా బారినపడ్డారు.  

9:24 AM IST: