బెంగుళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. ఈ రకమైన పరిస్థితుల్లో  పెళ్లిళ్లు కూడ వాయిదా పడుతున్నాయి.కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది మందితోనే పెళ్లి జరిగింది.

Also read:కరోనా దెబ్బ: పిఠాపురంలో పెళ్లిని నిలిపివేసిన అధికారులు

కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలోని మణియాండహళ్లికి చెందిన రేవతికి బెంగుళూరుకు చెందిన రేవతితో పెళ్లిని నిర్ణయించారు రెండు కుటుంబాల పెద్దలు. ఈ నెల 22వ తేదీన పెళ్లి జరిపించాలని ముందుగానే నిర్ణయం తీసుకొన్నారు.

అయితే ఈ పెళ్లి ముహుర్తం నిశ్చయం చేసిన సమయంలో కరోనా ప్రభావం అంతగా లేదు. అయితే పెళ్లికి రెండు కుటుంబాలకు చెందిన  వెయ్యి మంది వస్తారని భావించారు. వెయ్యి మంది కోసం భోజన వసతులను ఏర్పాటు చేశారు. 

అయితే కరోనా వైరస్ దెబ్బతో పెళ్లిళ్లను వాయిదా వేయాలని అధికారులు సూచించారు. అయితే వెయ్యి మంది వస్తారని భావించినప్పటికీ కేవలం ఎనిమిది మందితోనే శరత్, రేవతి పెళ్లి ఈ నెల 22వ తేదీన ఫంక్షన్ హల్ లో జరిగాయి.