Wedding Called Off: పెళ్ళికి ఆర్డ‌ర్ చేసిన చికెన్, మ‌ట‌న్ కుళ్లిపోయిన‌వి వ‌చ్చాయ‌ని పెళ్లి క్యాన్సల్ చేశారు.త‌మిళ‌నాడులో ఓ కుటుంబం పెళ్లికి వ‌చ్చిన వారికి బిర్యానీ పెట్టాల‌ని సేలం ఆర్ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు కాంట్రాక్ట్ ఇచ్చింది. వారు జొమాటో ద్వారా ఒక టన్ మటన్, 200 కిలోల చికెన్ ఆర్డర్ తీసుకున్నారు. అయితే మాంసం కుళ్లిపోయింది. దీంతో వారు అనుకున్నట్టుగా భోజనాల్లో బిర్యానీ లేక‌పోవ‌డంతో  పెళ్లి క్యాన్సల్ చేశారు. 

Wedding Called Off: ఈ మ‌ధ్య చిన్న చిన్న‌ కార‌ణాల‌తో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పెండ్లి కొడుకు మండ‌పానికి ఆలస్యంగా వచ్చాడనో.. పీక‌దాక‌ మంద్యం సేవించ‌డ‌నో.. వ‌రుడికి బట్టతల ఉంద‌నో.. లేదా అమ్మాయికో.. అబ్బాయికో పెళ్లికి ముందు ల‌వ్ ఎఫైర్ ఉంద‌ని పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు చూశాం. కానీ ఓ విచిత్రమైన కారణం వ‌ల్ల తమిళనాడులో ఓ పెళ్లి ఆగిపోయింది. ఓ కుటుంబ పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మ‌రికొద్ది గంట‌ల్లో పెళ్లి.. మండ‌పంమంతా.. పెళ్లికొచ్చిన చుట్టాలతో, మామిడి తోరణాలతో పండుగ వాతావరణం నెలకొంది. కానీ, ఊహించని ప‌రిణామం చోటు చేసుకోవ‌డంతో.. వైభవంగా జరగాల్సిన పెళ్లి ఆపేస్తున్నట్టు పెళ్లి కుటుంబం చెప్పడంతో అతిథులు అవాక్కయ్యారు. 


వివరాల్లోకి వెళితే.. త‌మిళ‌నాడులో ఓ కుటుంబం పెళ్లి వ‌చ్చిన‌ అతిథులకు నాన్ వెజ్ బిర్యానీతో భోజనాలు పెట్టాలనుకుంది. ఇందుకోసం.. సేలం ఆర్ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు కాంట్రాక్ట్ ఇచ్చారు. వారు జొమాటో ద్వారా ఒక టన్ మటన్, 200 కిలోల చికెన్ ఆర్డర్ తీసుకున్నారు. జొమాటో బెంగళూరు నుంచి తమిళనాడుకు మటన్, చికెన్‌ పార్శిల్స్‌ను పంపించింది. కానీ, ఊహించ‌ని విధంగా ఆ ఆన్‌లైన్ ఆర్డర్‌లో కుళ్లిన మాంసం వచ్చింది. వంట‌లు వండుతున్న స‌మ‌యంలో దుర్వాస‌న రావ‌డంతో పెళ్లివారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో రంగంలోకి దిగిన అధికారులు .. తనిఖీలు నిర్వహించి కుళ్లిన మాంసమేనని తేల్చారు. న‌మూనాల‌ను ల్యాబ్ కు త‌ర‌లించారు. దీనిపై సేలం ఆర్ ఆర్ బిర్యానీ, జొమాటో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అనుకున్న విధంగా అథితుల‌కు బిర్యానీ పెట్టాల‌నే ఆ కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. ఇలా సేలం ఆర్ ఆర్ బిర్యానీ, జొమాటో నిర్వ‌హ‌కంతో కొత్త జంట ఒకటి కాలేకపోయింది. ఈ ఘటన తమిళనాడులోని ఓరథనాడులో జరిగింది.

గతంలోనూ ఇలాంటి సంఘ‌ట‌న ఒడిస్సాలో చోటుచేసుకుంది. అక్కడ మటన్ బిర్యానీ లేకపోవడం వల్ల పెళ్లి క్యాన్సల్ అయింది. అతిథులకు భోజనాల్లో మటన్ కర్రీ లేదని తెలుసుకున్న వరుడు కుటుంబ సభ్యులు.. వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. ఆ గొడవ కాస్తా పెరిగి పెద్దది కావడంతో పెళ్లి క్యాన్సల్ అయింది.