Asianet News TeluguAsianet News Telugu

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో 4.4 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు..

New Delhi: దేశ రాజ‌ధానిలో ఉష్ణోగ్ర‌త‌లు రికార్డు క‌నిష్ట స్థాయికి ప‌డిపోతున్నాయి. ఢిల్లీలోని ప్రాథమిక వాతావరణ కేంద్రం సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీ 4.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతను నమోదుచేసింది. ఉద‌యం వేళ‌ల్లో దట్టమైన పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థ సైతం ప్రభావితమవుతోంది. 

Weather update:Temperatures dropped to 4.4 degrees Celsius in the national capital Delhi
Author
First Published Jan 4, 2023, 2:41 PM IST

Weather update: దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా ప‌డిపోతున్నాయి. రికార్డు స్థాయిలో క‌నిష్ట ఉష్ణోగ్ర‌తలు న‌మోద‌వుతున్నాయ‌. ఈ క్ర‌మంలోనే దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ సీజ‌న్ లోనే అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైంది. ఢిల్లీలోని ప్రాథమిక వాతావరణ కేంద్రం సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీ 4.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతను నమోదుచేసింది. ఉద‌యం వేళ‌ల్లో రోడ్డు ప‌క్క‌ల చ‌లిమంట‌లు కాసుకుంటున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అలాగే, రాజ‌ధాని ప్రాంతాన్ని ద‌ట్టమైన పొగ‌మంచు చుట్టుముట్టేసింది. "ఇండో-గంగా మైదానాలలో దట్టమైన పొగమంచు కొనసాగుతుంది. ఇది రాబోయే 2-3 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది" అని భారత వాతావరణ శాఖ (IMD) అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.

పొగ‌మంచు కార‌ణంగా దేశ‌రాజధాని ప్రాంతాల్లో ర‌వాణా వ్య‌వ‌స్థ ప్ర‌భావిత‌మ‌వుతోంది. పొగమంచు వాతావరణం మధ్య, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పాలం అబ్జర్వేటరీ వద్ద ఉదయం 5.30 గంటలకు 200 మీటర్ల విజిబిలిటీ స్థాయిని గుర్తించారు. ఢిల్లీలోని ప్రాథమిక వాతావరణ కేంద్రం సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో 4.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం రాత్రికి ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత క‌నిష్ట స్థాయికి చేరుకుంటాయ‌నీ, చ‌లి తీవ్ర‌త సైతం అధికంగా ఉంటుంద‌ని వాతావార‌ణ రిపోర్టులు పేర్కొంటున్నాయి. క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చున‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) అంచ‌నా వేసింది. "వచ్చే 3 రోజుల్లో వాయువ్య భారతదేశంలో చలిగాలుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత తీవ్రత తగ్గుతుంది" అని ఐఎండీ చేసిన ట్వీట్ పేర్కొంది. 

రాబోయే నాలుగైదు రోజులలో వాయువ్య ప్రాంతాలలో సాధార‌ణం నుంచి చాలా దట్టమైన పొగమంచు, చలి పరిస్థితులు ఉంటాయ‌ని ఐఎండీ అంచనా వేసింది. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా లేదా సమానంగా ఉన్నప్పుడు, గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉన్నప్పుడు అత్యంత చల్లని రోజుగా పేర్కొంటారు. రానున్న రోజుల‌లో చ‌ల్లని రోజులు మ‌రిన్ని న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంద‌ని కూడా ఐఎండీ పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినప్పుడు లేదా కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు, సాధారణం కంటే 4.5 నాచ్‌లు తక్కువగా ఉన్నప్పుడు మైదాన ప్రాంతాలకు శీతల తరంగ పరిస్థితిని ప్ర‌క‌టిస్తారు. 

మధ్యప్రదేశ్ 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర‌త న‌మోదు.. 

మధ్యప్రదేశ్ అంతటా చలి పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో చలిగాలుల గురించి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని వాతావరణ నిపుణులు తెలిపారు.  4.5 డిగ్రీల సెల్సియస్ వద్ద అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవడంతో గ్వాలియర్ రాష్ట్రంలోనే అత్యంత చలిగా ఉంది. ఈసారి గుణ 5.7 డిగ్రీల సెల్సియస్ వద్ద క‌నిష్ట ఉష్ణోగ్ర‌త నమోదైన‌ రాష్ట్రంలో రెండవ అతి శీతల ప్రాంతంగా అవతరించింది. అలాగే, భోపాల్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 7.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణ నిపుణులు ఎస్ఎన్ సాహు ఏఎన్ఐతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని భోపాల్, సాగర్, గ్వాలియర్, రేవా డివిజన్లలో చలి రోజులు ఉండవచ్చు. గ్వాలియర్ రాష్ట్రంలో అత్యంత శీతల ప్రాంతంగా ఉంది, ఇక్కడ ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల వద్ద నమోదైంది అని తెలిపారు. 

“మేము పొగమంచు గురించి మాట్లాడినట్లయితే, రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాలలో పొగమంచు ఉంటుంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతాల్లో కూడా పొగమంచు కనిపిస్తుంది. రాబోయే రెండు రోజులు వాతావరణ పరిస్థితులు అలాగే ఉంటాయి. దీని ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ చుట్టూ తిరుగుతుంది”అని ఆయ‌న పేర్కొన్నారు. రెండు రోజుల తరువాత, ఉష్ణోగ్రత క్రమంగా 1 నుంచి 2 డిగ్రీలు పెరుగుతుందని ఆయన చెప్పారు. మరోవైపు, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 9.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, జిల్లాలో దట్టమైన పొగమంచుతో ప్రజలు చలిగాలులను ఆస్వాదిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios