భారీ వర్షం, వడగళ్ల వాన.. ఉత్తర భారతానికి ఐఎండీ హెచ్చరికలు
New Delhi: గత 24 గంటల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్ సహా పలు ఉత్తర భారత ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6-10 డిగ్రీల మధ్య నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. వచ్చే వారంలో భారీ వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తుందని హెచ్చరించింది.

Weather Update: వచ్చే వారంలో ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, వడగళ్ల వాన పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. ఇదే సమయంలో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చుననీ, కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఉండకపోవచ్చునని తెలిపింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రాబోయే వారంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం అంచనా వేసింది.
జనవరి 24, 26 తేదీల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్ లో తేలికపాటి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వడగళ్లు సైతం పడే అవకాశముందని హెచ్చరించింది. గత 24 గంటల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, బీహార్, తూర్పు రాజస్థాన్, వాయవ్య మధ్యప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6-10 డిగ్రీల మధ్య నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది.
పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్ లోని పలు ప్రాంతాలు, బీహార్, తూర్పు రాజస్థాన్, వాయవ్య మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయనీ, 6-10 డిగ్రీల మధ్య ఉన్నాయని ఐఎండీ తెలిపింది. రానున్న 3 రోజుల్లో తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిశాలో రాత్రి, ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
నైరుతి రాజస్థాన్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. జనవరి 24 నుంచి 26 వరకు అరేబియా సముద్రం నుంచి పశ్చిమ హిమాలయ ప్రాంతంలో దిగువ, మధ్య ట్రోపోస్ఫెరిక్ స్థాయిల్లో పశ్చిమ హిమాలయ ప్రాంతంలోకి పశ్చిమ అల్పపీడనం నెమ్మదిగా తూర్పు దిశగా కదులుతుందని తెలిపింది. దీంతో జనవరి 24 నుంచి 26 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, వాయవ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జనవరి 25, 26 తేదీల్లో ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
జనవరి 24, 25 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్ లో, జనవరి 25న పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో, 24-26 తేదీల్లో ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ లలో వడగళ్ల వానలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. ఇదిలావుండగా, దేశ రాజధాని ఢిల్లీలో చలి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. దట్టమైన పొగమంచు రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదుచేస్తున్నాయి.