బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమేపీ బలపడి పెను తుపానుగా మారుతుందన్న వార్తా కథనాలను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తోసిపుచ్చింది. సూపర్ సైక్లోన్ పై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దనీ, అవన్నీ వట్టి పుకారు మాత్రమేనని భారత వాతావరణ విభాగం (IMD) స్పష్టం చేసింది.  

బంగాళాఖాతంలో అక్టోబరు 18న సూపర్ సైక్లోన్ భారత తీరాన్ని తాకే అవకాశం ఉందని, అది క్రమేపీ బలపడి పెను తుపానుగా మారుతుందన్న వార్తా కథనాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ)స్పందించింది. సూపర్ సైక్లోన్ గురించి జరుగుతున్న ప్రచారం నమ్మవద్దనీ, అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని భారత వాతావరణ విభాగం (IMD) స్పష్టం చేసింది. 

ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ M మహపాత్ర మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సైక్లోన్ గురించి జరుగుతున్న ప్రచారం నమ్మవద్దనీ, అటువంటి ముప్పు ఏమీ లేదని ధృవీకరించారు, ప్రజలు పుకార్లను పట్టించుకోవద్దన్నారు.తాము సూపర్ సైక్లోన్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని డాక్టర్ మోహపాత్ర చెప్పారు.

కెనడాలోని సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయంలో వాతావరణ శాస్త్రంలో పీహెచ్ డీ చేస్తున్న విద్యార్థి బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడవచ్చని అంచనా వేసినట్టు తెలుస్తోందనీ,ఈ నేపథ్యంలోనే ఆ వార్త ప్రచారంలోకి వచ్చిందనీ, దీనికి కారణమదేనని అన్నారు. అయినా.. అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. సూపర్ సైక్లోన్‌కు సిత్రంగ్ అని పేరు పెట్టనున్నట్లు కూడా చెప్పారు.

ఇదే విషయంపై భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు మీడియతో మాట్లాడుతూ.. ఐఎండీ నుంచి తుఫాను గురించి ఎలాంటి సూచనను జారీ చేయలేదని, తీరప్రాంత రాష్ట్రంలో తుఫాను వచ్చే అవకాశం ఉందని, అలాంటి పుకార్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

"భారత వాతావరణ శాఖ తుఫానుపై ఎటువంటి సూచన చేయలేదు. దీనికి సంబంధించి ఎటువంటి సూచనను కూడా ఇవ్వలేదు. దయచేసి పుకార్లకు దూరంగా ఉండండి" అని IMD యొక్క ప్రాంతీయ కేంద్రం ట్వీట్ చేసింది. "మేము ఖచ్చితమైన వాతావరణ సంబంధిత సమాచారాన్ని అందించడానికి 24 గంటలూ పని చేస్తున్నాము. కాబట్టి దయచేసి పుకార్లకు దూరంగా ఉండండి" అని పేర్కొంది.

అక్టోబరు 18న అండమాన్ సముద్రం మీదుగా తుఫాను ఏర్పడే అవకాశం ఉందని IMD ఇంకా వివరించింది.ఈ వ్యవస్థ అక్టోబరు 20 న అల్పపీడనంగా రూపాంతరం చెందడానికి ముందు పశ్చిమ-మధ్య బంగాళాఖాతం వైపు కదులుతుంది. అయితే, ఈ వాతావరణ వ్యవస్థ సూపర్ సైక్లోన్ కు దారితీసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.