Asianet News TeluguAsianet News Telugu

క‌ర్నాట‌క‌లో బీజేపీతో క‌లిపి ప‌నిచేస్తాం.. : జేడీ(ఎస్) నేత‌, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి

Bengaluru: బీజేపీతో కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు జేడీ(ఎస్) నేత, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. బీజేపీ, జేడీ(ఎస్)లు రెండూ ప్రతిపక్ష పార్టీలు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు అసెంబ్లీ లోపల, వెలుపల తాను ఇప్పటికే చెప్పానని చెప్పారు. శుక్ర‌వారం ఉదయం కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారని చెప్పారు.
 

We will work together with BJP in Karnataka: JD(S) leader and former CM HD Kumaraswamy RMA
Author
First Published Jul 22, 2023, 1:53 AM IST

Karnataka's former Chief Minister HD Kumaraswamy: బీజేపీతో కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు జేడీ(ఎస్) నేత, క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు అసెంబ్లీ లోపల, వెలుపల తాను ఇప్పటికే చెప్పానని చెప్పారు. శుక్ర‌వారం ఉదయం కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారని చెప్పారు.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షంగా బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. పార్టీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడకు ఉందనీ, దీనిపై మాట్లాడేందుకు పార్లమెంటు ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జేడీఎస్ ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో గురువారం రాత్రి దేవెగౌడ పాల్గొన్న జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశంలో జరిగిన చర్చలపై అడిగిన ప్రశ్నకు కుమారస్వామి సమాధానమిచ్చారు.

బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు అసెంబ్లీ లోపల, వెలుపల తాను ఇప్పటికే చెప్పానని చెప్పారు. శుక్ర‌వారం ఉదయం కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారని చెప్పారు. నేతలందరి అభిప్రాయాలను సేకరించి, అన్ని వర్గాల ప్రాతినిథ్యంతో 10 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలని శాసనసభా పక్ష సమావేశంలో గౌడ సూచించారు.

క‌ర్నాట‌కలో పార్టీ పనితీరు పేలవంగా ఉండటంతో జేడీఎస్ భారీ పునర్వ్యవస్థీకరణకు ప్రణాళికలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉంది. మరి పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో చూడాలి. పార్టీ నిర్వహించాలని సూచించారు. అలాగే, పార్టీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం తనకు ఉందని దేవెగౌడ చెప్పారన్నారు. కాగా, మేలో జరిగిన 224 మంది సభ్యుల క‌ర్నాట‌క‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 66, జేడీ(ఎస్) 19 స్థానాల్లో గెలుపొందాయి.

ఇటీవ‌లి కర్ణాటక ఎన్నికల్లో ఘోర పరాభవంతో నివ్వెరపోయిన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీ వైపు మొగ్గు చూపుతోందనీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుతో సంకేతాలు పంపిందని ఇదివ‌ర‌కు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించి కింగ్ మేకర్ పాత్ర పోషించాలన్న జేడీఎస్ ఆశలను నీరుగార్చి కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 224 స్థానాలకు గాను జేడీఎస్ కేవలం 19 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ ఒకప్పటి మిత్రపక్షమైన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ ను ఓడించి తన ఓటు బ్యాంకును కాపాడుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios