న్యూఢిల్లీ: దేశంలో మరోసారి అధికారంలోకి వస్తామని ప్రధానమంత్రి మోడీ ధీమాను వ్యక్తం చేశారు.

శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

సోషల్ మీడియా వచ్చాక  బాధ్యత మరింత రెట్టింపు అయిందని మోడీ అభిప్రాయపడ్డారు.. రెండో దఫా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని మోడీ ధీమాను వ్యక్తం చేశారు.

ఎన్నికలు జరుగుతున్నాయని ఐపీఎల్‌ను విదేశాలకు తరలించాల్సిన పరిస్థితులు రాలేదని మోడీ చమత్కరించారు.భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని గర్వంగా చెబుతానన్నారు.దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గాను మేనిఫెస్టోలో అనేక అంశాలను చేర్చామని మోడీ గుర్తు చేశారు.మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించినట్టుగా మోడీ గుర్తు చేశారు.పక్కా ప్రణాళికతో పథకాలను నిర్వహించామన్నారు.

బీజేపీకి ఓటేయాలని ప్రజలు నిర్ణయం తీసుకొన్నారని మోడీ చెప్పారు.  ఈ ఎన్నికల ప్రచారంలో తన ఒక్క ప్రచార కార్యక్రమం కూడ రద్దు కాలేదన్నారు. అంతేకాదు తన ఎన్నికల ప్రచారానికి వాతావరణం కూడ సహకరించిందని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల ప్రచారం పూర్తైనందున తాను పరిపాలన విధుల్లో మునిగి తేలుతానని మోడీ చెప్పారు.

సంబంధిత వార్తలు

మరోసారి కేంద్రంలో బీజేపీ సర్కార్ ఖాయం: అమిత్ షా