న్యూఢిల్లీ:  కేంద్రంలో  మరోసారి మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆ పార్టీ నేత రాం మాధవ్ అభిప్రాయపడ్డారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కూడ తమ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరని ఆయన చెప్పారు.

ఆదివారం నాడు ఆయన న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో బీజేపీ ప్రాతినిథ్యం వహించిన స్థానాలను పోగొట్టుకొన్నా కూడ  కొత్త స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ఎక్కువ స్థానాలను గెలుస్తామని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో  ఈ దఫా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి 20 స్థానాల్లో గెలుస్తామన్నారు.బీజేపీని ఓడించడమే లక్ష్యంగానే  చంద్రబాబునాయుడు పనిచేశారని రాం మాధవ్ ఆరోపించారు. అయితే  తమ పార్టీ విజయాన్ని మాత్రం బాబు ఆపలేరని ఆయన  చెప్పారు.