అయోధ్య రామమందిరాన్ని కూల్చేసి, దాని స్థానంలో మసీదు నిర్మిస్తామని ఉగ్రవాద సంస్థ తన పత్రిక సంపాదకీయంలో హెచ్చరించింది. భారతీయ ముస్లింలకు లౌకికవాదం అంటే ఒక నరకం అని అభివర్ణించింది. 

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని కూల్చివేసి దాని స్థానంలో మసీదును నిర్మిస్తామని అల్-ఖైదా తమ జర్నల్ ఘజ్వా-ఏ-హింద్ తాజా సంచికలో హెచ్చరించింది. ఈ వారం విడుదల చేసిన ఆన్ లైన్ మ్యాగజైన్‌ డిసెంబర్ ఎడిషన్‌లో ఆ ఉగ్రవాద సంస్థ ఈ విషయాలన్నీ పేర్కొంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను కూడా టార్గెట్ చేశారు. దీనితో పాటు భారతీయ ముస్లింలు జిహాద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

భార‌త్ లోకి ప్ర‌వేశించిన క‌రోనా సూప‌ర్ వేరియంట్.. కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే..?

బాబ్రీ మసీదు శిథిలాలపై రామమందిరాన్ని నిర్మిస్తున్న మాదిరిగానే, దానిని కూల్చివేసి విగ్రహాల స్థానంలో అల్లాహ్ పేరిట బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తామని అల్ ఖైదా తన 110 పేజీల మ్యాగజైన్‌ సంపాదకీయంలో పేర్కొంది. ఘజ్వా-ఎ-హింద్‌లో భారతీయ ముస్లింలను ప్రభావితం చేయడానికి ఉగ్రవాద సంస్థ ప్రయత్నించింది. ముస్లింలు ఇప్పటికే చాలా కష్టాలు పడ్డారని, అందుకే ప్రాణ, ఆస్తి నష్టానికి భయపడవద్దని సూచించింది. ‘ఈ జీవితం, సంపదను జిహాద్ కోసం ఉపయోగించినట్లయితే ఇంత నష్టం జరిగేది కాదు.’ అని పేర్కొంది. 

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై నటి జమీలా జామిల్ విమర్శలు.. బూతులు ఉపయోగించి మరీ..

భారతీయ ముస్లింలకు లౌకికవాదం అంటే ఒక నరకం అని, హిందూ-ముస్లిం ఐక్యత నినాదాలు ఒక ప్రహసనం అని ఆ మ్యాగజైన్‌ అభివర్ణించింది. ‘‘హిందువులందరికీ కర్రలు వాడటం నేర్పుతున్నారు. కూరగాయలు కోసే కత్తులతో ముస్లింల ముఖాలు, తలలు నరుకుతామన్న మాట హిందూ మహిళల నోటి నుంచి వినిపిస్తోంది.’’ అని పేర్కొంది. విధానసభ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడు, జామియా మిలియా, అలీఘర్‌ నుంచి జామియా ఉస్మానియా, దేవబంద్‌ వరకు ప్రతి ముస్లిం, కూరగాయల వ్యాపారి, దినసరి కూలీ ఎదుట హిందూ మతం కత్తులు, ఈటెలు, కత్తులకు పదును పెడుతోందని తెలిపింది. 

జిహాద్‌తో పోరాడాలని అల్-ఖైదా భావిస్తోందని, దీని వల్ల భారతదేశం మొత్తం ఇస్లాం ప్రపంచంలో భాగమవుతుందని, విగ్రహారాధన ఆగిపోతుందని పేర్కొంది. ఈ మ్యాగజైన్ చివరి పేజీలో.. సమస్యకు జిహాద్ పరిష్కారమని పేర్కొంది. ‘జామియా మసీదు శ్రీనగర్‌ నుంచి బాబ్రీ మసీదు వరకు... జిహాదే పరిష్కారం’ అని తెలిపింది. 

తీవ్ర‌మైన చ‌లి, ద‌ట్ట‌మైన పొగ‌మంచు.. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం మ‌ధ్య ఢిల్లీలో విమానాలు ఆలస్యం

కాగా.. ఈ మ్యాగజైన్‌లోని కంటెంట్‌ను భారతీయ వాతావరణం గురించి తెలిసిన వారు రాసినట్లు కనిపిస్తోందని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ‘ది ప్రింట్’తో అన్నారు. ఏప్రిల్‌లో హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా మాజీ చీఫ్ అమాన్ అల్-జవహరి తన నిరసనను వీడియోలో నమోదు చేసిన తర్వాత భారతదేశంపై అల్-ఖైదా దృష్టి సారించింది. గతేడాది జులై 31న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లోని ఆయన ఇంటి వద్ద యూఎస్ డ్రోన్ దాడిలో అల్-జవహిరి మరణించాడు.

మరో యువకుడితో ఫోటోలు షేర్ చేసిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య..!

2019లో ఆఫ్ఘనిస్తాన్‌లోని ముసా ఖలా జిల్లాలో యూఎస్ వైమానిక దాడిలో అల్-ఖైదా దక్షిణాసియా విభాగం వ్యవస్థాపకుడు, అసిమ్ ఉమర్ అలియాస్ సనా-ఉల్-హక్ మరణించాడు. అతడు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా నివాసి. అల్-ఖైదాకు 1988లో ఒసామా బిన్ లాడెన్ పునాది వేశాడు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001 సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన దాడి తరువాత ఈ ఉగ్రవాద సంస్థ వెలుగులోకి వచ్చింది.