న్యూఢిల్లీ: రైతులకు నష్టం చేసే మూడు చట్టాలను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో  రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన కొందరు రైతులకు తాము ఎందుకు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నామో కూడ స్పష్టత లేదు. 

ఈ విషయమై ట్విట్టర్ వేదికగా పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నో ది నేషన్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోలను షేర్ చేసింది. 

 

మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిన రైతు రైతులకు నష్టం చేసే చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా తాను ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా చెప్పారు. రైతులకు నష్టం కల్గించే చట్టాలు ఏమిటో తనకు తెలియవన్నారు.తాను ఉపాధి కోసం వచ్చానని ఆయన చెప్పారు.

 

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి సూర్యభగవాన్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు.  తాను రైతు కాదని చెప్పాడు. జీతాలు అందుకొంటటున్నా కూలీలు ఆకలితో ఉన్నారని ఆయన తెలిపారు. 

 

 

తాను రైతుల కోసం ఇక్కడికి వచ్చినట్టుగా ఆయన చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లుల గురించి ఆయన ఆయన సరైన సమాధానం చెప్పలేదు.చాలా మంది కూలీలు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన చెప్పారు.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన మేజర్ సింగ్  ఎఐకెఎస్ కు చెందిన సభ్యుడు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు.  ఆందోళనలో పాల్గొన్న రైతులకు సరిపడు ఆరు మాసాల ఆహార సామాగ్రిని తీసుకెళ్తున్నట్టుగా ఆయన చెప్పారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చౌహాన్ అనే వ్యక్తి  తాను కార్మికుడినని చెప్పారు.తాను పనిచేసే కంపెనీ మూసివేసినట్టుగా చెప్పారు.దీంతో తాను నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానన్నారు.

ఇది రైతుల నిరసన కదా అని ప్రశ్నిస్తే... తాము రైతుల పిల్లలలాంటివాళ్లమే కదా అని ఆయన చెప్పారు.వ్యవసాయ చట్టాలతో మీ సమస్యలు ఏమిటనే దానికి  ఆయన సరైన సమాధానం చెప్పలేదు.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన మల్లి అనే వ్యక్తి  ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాడు. అంబానీ, అదానీ తన భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. పంట రేట్లను ప్రైవేటీకరించారు.. దీంతో తాను నిరసన తెలిపేందుకు వచ్చానని చెప్పారు. 

పంటకు మద్దతు ధర కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది కదా.. అంటే అవును ప్రకటించిన విషయం వాస్తవమేనని ఆయన తెలిపారు.ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వనున్నట్టుగా తెలిపిన కూడ ఎందుకు నిరసన తెలుపుతున్నారని ప్రశ్నిస్తే  సరైన సమాధానం లేదు

 

తన వెంట ఆయన కనీసం రెండు నుండి మూడు నెలల వరకు సరిపడు రేషన్ తెచ్చుకొన్నాడు. గురుగ్రామ్ కు చెందిన లలిత్ రైతుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చినట్టుగా చెప్పారు. నిరసనకారులు ఎందుకు నిరసన తెలుపుతున్నారో తనకు కచ్చితంగా తెలియదన్నారు. కానీ ఈ ఆందోళనకు తాను మద్దతిచ్చేందుకు వచ్చినట్టుగా ఆయన చెప్పారు.