Asianet News TeluguAsianet News Telugu

మాంసాహార నిషేధంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

మాంసాహార నిషేధంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా మారాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మాంసం ఎగుమతులపై నిషేధం విధించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీం కోర్టు స్పందించింది. 

We cannot order everyone to be vegetarian  Supreme Court tells petitioners
Author
Delhi, First Published Oct 12, 2018, 6:57 PM IST

ఢిల్లీ: మాంసాహార నిషేధంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా మారాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మాంసం ఎగుమతులపై నిషేధం విధించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీం కోర్టు స్పందించింది. 

అందరూ శాఖాహారులుగా మారాలంటూ మేము ఆదేశాలు జారీచేయలేమని తెలిపింది. దేశంలోని అందరూ శాఖాహారులు అవ్వాలని మీరు కోరుకుంటున్నారా అంటూ జస్టిస్ మదన్ బి లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది.
 
అయితే బుధవారం హిందూత్వ సంస్థలకు చెందిన పలువురు యువకులు ఢిల్లీ వీధుల్లో హల్ చల్ చేశారు. మాంసం దుకాణాలు మూసెయ్యాలంటూ హడావిడి చేశారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేవరకు మాంసం దుకాణాలు తెరిస్తే షాపులు ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. 

పాలెం విహార్, సూరత్ నగర్, అశోక్ విహార్, సెక్టార్ 5, 9, పటౌడీ చౌక్, జాకోబ్‌పురా, సదర్ బజార్, ఖద్సా అనాజ్ మండి, బస్టాండ్, డీఎల్ఎఫ్ ప్రాంతం, సోహ్నా, సెక్టార్ 14 సహా పలు చోట్ల షాపులు బలవంతంగా మూసివేయించినట్టు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios